Silver Items : మీ వెండి వస్తువులు నల్లగా ఉన్నాయా..? అయితే ఇలా చెయ్యండి తళతళలాడాల్సిందే !
Silver Items : మార్కెట్‌లో లభించే కెమికల్ క్లీనింగ్ పదార్థాలు తాత్కాలికంగా మెరిసేలా చేస్తాయి కానీ, కొంతకాలానికి వెండి మరింత రంగు కోల్పోతుంది
- By Sudheer Published Date - 07:37 AM, Sat - 15 March 25

ఇంట్లో మనం ఉపయోగించే వెండి (Silver Items) ఉంగరాలు, గొలుసులు, ఇతర అలంకార వస్తువులు కాలక్రమంలో గాలి, తేమ, రసాయనాల ప్రభావంతో (Black) నల్లబడతాయి. వీటిని సాధారణంగా నీటితో కడిగినా, క్లీన్ చేసినా ముందులా మెరుపు రావడం కష్టమే. మార్కెట్‌లో లభించే కెమికల్ క్లీనింగ్ పదార్థాలు తాత్కాలికంగా మెరిసేలా చేస్తాయి కానీ, కొంతకాలానికి వెండి మరింత రంగు కోల్పోతుంది. అయితే ఇంట్లోనే సహజమైన పదార్థాలను ఉపయోగించి వెండి వస్తువులను కొత్తవాటిలా మెరిపించవచ్చు.
Donald Trump New Tax Plan: రూ. 1.31 కోట్ల వరకు సంపాదిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పనున్న ట్రంప్!
శనగపిండి, పసుపు కలిపిన మిశ్రమాన్ని నీటితో పేస్టులా తయారు చేసి వెండి వస్తువులపై రుద్దితే అవి మళ్లీ మెరుస్తాయి. అలాగే, టూత్‌పేస్ట్ లేదా టాల్కం పౌడర్‌ను నీటితో కలిపి రుద్దినా మంచి ఫలితం పొందవచ్చు. మరో సాధారణ పద్ధతిగా రాళ్ల ఉప్పు, నిమ్మరసం కలిపి బ్రష్‌తో రుద్దితే, వెండి మీద ఉన్న నల్లటి మరకలు తొలగిపోతాయి. ఈ విధానాలు రసాయన పదార్థాలను ఉపయోగించకుండా, సురక్షితంగా శుభ్రం చేసేందుకు అనువైనవే.
Janasena Formation Day : నా తెలంగాణ కోటి రతనాల వీణ – పవన్ కళ్యాణ్
వెండి వస్తువులను మరింత మెరిపించడానికి బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించుకోవచ్చు. ఓ గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ పరుచుకుని, అందులో గోరువెచ్చని నీరు, బేకింగ్ సోడా వేసి వెండి వస్తువులను ఉంచాలి. ఇది రసాయన చర్య ద్వారా మురికిని తొలగించి మెరుపును తీసుకురావడమే కాకుండా, దీర్ఘకాలం మెరుస్తూ ఉండేలా చేస్తుంది. ఈ పద్ధతులు తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే వెండి వస్తువులను కొత్తవాటిలా మెరిపించేందుకు ఉపయోగపడతాయి.