SmartPhone at Morning : ఉదయం లేవడంతోనే స్మార్ట్ ఫోన్ చేస్తున్నారా..? భవిష్యత్తులో మీకు ఈ జబ్బు ఖాయం..!!
- By hashtagu Published Date - 06:12 AM, Wed - 2 November 22

టెక్నాలజీ స్పీడ్ గా దూసుకెళ్తోంది. జీవితాన్ని కూడా అదే విధంగా పరిగెత్తిస్తోంది. తినడానికి సమయం కూడా దొరకడం లేదు. అసలే తిండే మర్చి పోతున్నారు జనాలు. ఉద్యోగులకు…రాత్రిళ్లు పనిచేయడం అలవాటు అయ్యింది. అసలు నేచర్ తో వారికి సంబంధం లేనట్లే ఉంటారు. దీంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లు, ల్యాప్ టాప్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి రావడంతో చాలామంది వాటికి బానిసలుగా మారారు. ఉదయం లేచింది మొదలు…వెంటనే మొబైల్ చూడాల్సిందే. కొందరు కళ్లుమూసుకుని మొబైల్ కోసం వెతుకుతుంటారు. లేచింది మొదలు మళ్లీ పడుకునేంత వరకు మొబైల్ లేనిదే జీవితం లేనట్లుగా మారిపోయారు జనాలు. అయితే కొందరికి నిద్రలేచిన వెంటనే మొబైల్ చూసే అలవాటు ఉంటుంది. కానీ అలా చూడటం చాలా ప్రమాదకరమట.
ఉదయం లేవగానే ఫోన్ చూస్తే…ఫోన్లోని ఆ వెలుగు పూర్తిగా కళ్లపై పడుతుంది. అందుకే ఎలాగైనా సరే ఆ అలవాటను మానుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు వైద్యులు. మొబైల్ చూస్తే కలిగే దుష్ర్పభావాలు చాలామందికి తెలియవు. అప్పటి వరకు మూసుకుని ఉన్న కళ్లపై ఎక్కువ కాంతి పడటంతో కళ్లు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో రోజంతా కళ్లు ప్రభావవంతంగా పనిచేయలేవు.
స్మార్ట్ ఫోన్ చూసే అలవాటు ఉంటే చూసిన తర్వాత యోగా, మెడిటేషన్ చేడయం మంచిది. ముఖం కడుకోవడం వంటివి చేసిన కంటి నొప్పి అనేది తగ్గదు. అందుకే కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ అలవాట్లను దూరం చేసుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇది లేనిపోని అనార్దాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. వయస్సు మీదపడుతున్నా కొద్దీ కళ్లు కనిపించకుండా పోతాయి. కానీ వయస్సులో ఉన్నప్పుడే కంటి చూపు కోల్పోవడం చాలా ప్రమాదకరం.