Festival Time – Gut Health : ఫెస్టివల్ టైంలో హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్
Festival Time - Gut Health : ఫెస్టివల్ టైంలో కొంతమంది తినే తిండికి లెక్క అనేది ఉండదు.
- By Pasha Published Date - 09:15 PM, Sun - 22 October 23

Festival Time – Gut Health : ఫెస్టివల్ టైంలో కొంతమంది తినే తిండికి లెక్క అనేది ఉండదు. మితిమీరిన లెవల్ లో ఏది పడితే అది.. ఎంతపడితే అంత తింటుంటారు. ఈక్రమంలో వాటి వల్ల హెల్త్ పై పడే ఎఫెక్ట్ గురించి అస్సలు ఆలోచించరు. ఇలా ఫుడీలుగా మారిపోయేవారు.. పండుగల తర్వాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పరిస్థితి అక్కడి దాకా వెళ్లకూడదంటే ముందే మేల్కొనాలి. పండుగ టైంలో తీసుకునే ఫుడ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రుచి కంటే ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలనే విషయాన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. మన జీర్ణవ్యవస్థను కాపాడుకునేందుకు అనుగుణంగా ఫుడ్స్ ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇలాంటి కొన్ని టిప్స్ (Festival Time – Gut Health) ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
- పండుగ వేళ రుచికరమైన ఫుడ్స్ ను ట్రై చేయండి. కానీ ఒక లిమిట్ పెట్టుకోండి. మీ కడుపు నిండిపోయిందని అనిపిస్తే తినడం ఆపేయండి.
- నీరు ఎక్కువగా తాగండి. హెర్బల్ టీలు, పండ్ల రసాలు తీసుకుంటే ఇంకా బెస్ట్. నీళ్లు ఎక్కువగా తాగితే.. బాడీ నుంచి టాక్సిన్స్ ఈజీగా బయటకు వెళ్లిపోతాయి.
- గ్రీన్ టీ, సలాడ్లు, పండ్లు తీసుకోవచ్చు.
- జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలంటే.. కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ తినండి.
- పెరుగు వంటి ప్రోబయోటిక్స్ ఆహారాలు జీర్ణక్రియకు మంచివి.
- మద్యం, సిగరెట్స్ తీసుకుంటే.. జీర్ణసమస్యలు వస్తాయి.
- బ్రీత్ ఎక్సర్సైజ్లు చేయండి. యోగా చేయండి.
- భోజనం చేసిన తర్వాత కాస్త నడవండి.
- సరైన నిద్ర అవసరం.
- ఒక పూట ఎక్కువగా తింటే.. మరో పూట ఫుడ్ కంట్రోల్ చేయండి.
Also Read: world cup 2023: మిచెల్ సెంచరీ.. భారత్ టార్గెట్ 274