Amul Franchise Cost in India: సరికొత్త అవకాశాలు కల్పిస్తున్న అమూల్ సంస్థ.. ఫ్రాంఛైజీ బిజినెస్‌తో లక్షల్లో ఆదాయం?
ప్రస్తుత రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఉద్యోగాలు చేస్తున్న కూడా సంపాదన అస్సలు సరిపోవడం లేదు. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగా
- By Nakshatra Published Date - 02:30 PM, Thu - 7 December 23
ప్రస్తుత రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఉద్యోగాలు చేస్తున్న కూడా సంపాదన అస్సలు సరిపోవడం లేదు. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలను మానేసి బిజినెస్ లు చేస్తున్నారు. ఇంకొందరు ఇతర ఆదాయ మార్గాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. కొందరు ఉద్యోగాలు మానేసి వ్యవసాయం చేసుకుంటుండగా మరి కొందరు పశువులను పెంచుకుంటూ పాల ఉత్పత్తులతో నెలకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఉద్యోగాల్లో వచ్చే డబ్బులు సరిపోక సరికొత్త బిజినెస్ చేయాలి అనుకుంటున్నా వారికి అమూల్ సంస్థ ఒక చక్కటి ఆదాయ మార్గాన్ని అందిస్తోంది.
అమూల్ సంస్థ అందిస్తున్న పాల ఉత్పత్తుల్ని విక్రయించే ఫ్రాంఛైజీ తీసుకోవడం మంచి మార్గంగా చెబుతున్నారు. ఈ గుజరాతీ బ్రాండ్ దేశ వ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లో అమూల్ పాల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న అమూల్ సంస్థ 2 రకాల ఫ్రాంఛైజీల్ని పంపిణీ చేస్తోంది. ఈ రెండు రకాల ఫ్రాంఛైజీల ఖర్చు, ఆదాయం వేర్వేరుగా ఉంటుంది. అమూల్ తన ఉత్పత్తు్ల్ని విక్రయించడంపై కమిషన్ ఇస్తుంది. దీనితో రెగ్యులర్‌గా ఆదాయం పొందవచ్చు. అమూల్ డెయిరీ ఉత్పత్తుల ఫ్రాంఛైజీ ప్రారంభించడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పెట్టుబడి కావాలి. దీని కోసం ప్రధాన రహదారి పక్కన దుకాణం కలిగి ఉండాలి. అలాగే అమూల్ అవుట్లెట్ ప్రారంభించేందుకు కనీసం 150 చదరపు అడుగుల దుకాణం అవసరం పడుతుంది.
ఇంకా అమూల్ ఐస్‌క్రీం పార్లర్ తెరవాలంటే కనీసం 300 చ.అడుగుల స్థలం ఉండాలి. పైగా అమూల్ అవుట్ లెట్‌ను స్టార్ట్ చేయాలంటే నాన్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ గా రూ. 25 వేలు చెల్లించాలి. ఇంటీరియర్ కోసం రూ. లక్ష, ఇతర పరికరాల కోసం రూ. 75 వేలు కట్టాలి. ఐస్‌క్రీం పార్లర్‌కు అయితే సెక్యూరిటీ డిపాజిట్ రూ. 50 వేలు, మరమ్మతులకు రూ. 4 లక్షలు, పరికరాలకు రూ. 1.50 లక్షల అవసరం పడుతుంది. కమిషన్ రూపంలో మీరు అమ్మే ప్రొడక్ట్స్‌పై ఆదాయం పొందవచ్చు. పాల ప్యాకెట్ల పై 2.5 శాతం, ఇతర మిల్క్ ప్రొడక్టులపై 10 శాతం, ఐస్‌క్రీంలపై 20 శాతం కమిషన్ రూపంలో లాభం వస్తుంది. దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ https://amul.com సందర్శించవచ్చు. ఈ లింక్ క్లిక్ చేయగానే అమూల్ ఫ్రాంఛైజీ ప్రకటనే కనిపిస్తుంది. ఏదైనా అనుమానాలు ఉన్నా పూర్తి వివరాల కోసం కంపెనీ అందించిన 022-68526666 నంబర్‌ను సంప్రదించవాళ్ళుచ్చు.
Related News
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాల్దీవుల విదేశాంగ మంత్రి మూస�