Beauty Tips: ఈ మడ్ ప్యాక్ తో ముఖంపై మచ్చలను ఈజీగా తగ్గించుకోండిలా?
మామూలుగా చాలామందికి ముఖంపై మచ్చలు చూడడానికి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మొటిమలు వాటి తాలూకా మచ్చలతో ముఖం అందవిహీనంగా కనిపిస్తూ
- By Nakshatra Published Date - 06:00 PM, Wed - 3 January 24
మామూలుగా చాలామందికి ముఖంపై మచ్చలు చూడడానికి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మొటిమలు వాటి తాలూకా మచ్చలతో ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖంపై మచ్చలను పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగితే మరికొందరు ఇంట్లోనే దొరికే వాటితో హోమ్ రెమెడీలను ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖంపై మచ్చలు తగ్గిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ఇంట్లోనే ఈ మడ్ ప్యాక్ తయారు చేసుకొని ముఖానికి అప్లై చేస్తే చాలు అతి తక్కువ కాలంలోనే అందంగా తయారవ్వవ చ్చు. అయితే మరి ఈ మడ్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మడ్ ప్యాక్ కోసం నల్ల మట్టి ఉంటే సరిపోతుంది. నగరాలు, పట్టణాల్లో ఉండే వాళ్లు ఊళ్ల నుండి ఈ నల్లమట్టని తెప్పించుకొని సుత్తి లేదా బండతో బాగా కొట్టుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత దానిలో ఉండే వేర్లు పుల్లలు లాంటివి తీసేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒకసారి మళ్లీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఒకసారి జల్లెడ పట్టుకోవాలి.
మెత్తగా అంటే బియ్యప్పిండి లాగా ఉండేలా చూసుకోవాలి. జల్లించిన మట్టిని మరొకసారి ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల దానిలో ఏమైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయి. ఎండ బెట్టిన మట్టిని ఏదైనా జిప్ లాక్ బ్యాగ్ లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. మీ ముఖానికి సరిపడినంత మట్టిని ఒక గిన్నెలో తీసుకొని కుండలోని చల్లని నీరు వేసి 3 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్యలో నీళ్లు వేయడం వల్ల దానిలో ఉండే పోషకాలు డెవలప్ అవుతాయి. బాగా నానిన మట్టిని ముఖంపై అర అంగుళం మందంలో కళ్లు, ముక్కు, పెదవుల దగ్గర వదిలేసి ముఖమంతా అప్లై చేసుకోవాలి. మట్టి నానబెట్టుకునేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ముఖానికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. 25 నుంచి 45 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ముఖం అంతా బిగుసుకున్నట్లు అవుతుంది. తర్వాత ముఖాన్ని రుద్దుతూ కడుక్కోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. ముఖంపై ఉండే మలినాలు, వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. మొటిమలకు కారణం అయ్యే వైరస్ ను కూడా నాశనం చేస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే నల్లని మచ్చలు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.
Related News
Buttermilk: వేసవిలో మజ్జిగతో మీ అందాన్ని రెట్టింపు.. ఎలా అంటే?
పాలు పాల పదార్థాలు అయిన పెరుగు, మజ్జిగ లాంటి వాటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. చాలామందికి అన్నం త