Pressure Cooker : వంట చేసేందుకు ప్రెజర్ కుక్కర్.. అల్యూమినియమా లేక స్టీల్? ఏది మంచిది?
హడావిడి జీవితంలో రోజూ కుక్కర్ లోనే వంట చేయడానికి ఇష్టపడుతున్నారు. కుక్కర్ లలో ఎక్కువగా అల్యూమినియం(Aluminium), స్టీల్(Steel)వి అందుబాటులో ఉంటాయి.
- Author : News Desk
Date : 19-08-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
అన్నం, పప్పు, బిర్యానీ లేదా ఇంకా ఏమైనా కూరగాయలను ఉడికించడానికి తొందరగా అవ్వడానికి మనం ప్రెజర్ కుక్కర్(Pressure Cooker) ను వాడుతుంటాము. అయితే మనం హడావుడి రోజుల్లో కాకుండా రోజూ వారి సమయంలో కూడా కుక్కర్ ను వాడుతుంటాము. ఎందుకంటే మనం అన్నాన్ని గంజి వార్చి వండే పద్దతిలో ఎక్కువ సమయం పడుతుంది, ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరూ హడావిడి జీవితంలో రోజూ కుక్కర్ లోనే వంట చేయడానికి ఇష్టపడుతున్నారు.
అయితే కుక్కర్ లలో ఎక్కువగా అల్యూమినియం(Aluminium), స్టీల్(Steel)వి అందుబాటులో ఉంటాయి. అల్యూమినియం బరువు తక్కువగా ఉంటుంది. అది తొందరగా వేడి ఎక్కుతుంది. దీని ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అల్యూమినియం కుక్కర్ ఎక్కువగా వాడడానికి ఇష్టపడతారు. కానీ అల్యూమినియం కుక్కర్ వేడెక్కినప్పుడు ఈ లోహం ఆహారంలోనికి చేరి విషపూరితం అవుతుంది. అల్యూమినియం కుక్కర్ రంగు త్వరగా పోతుంది.
స్టీల్ కుక్కర్ ధర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీని బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. స్టీల్ కుక్కర్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. దీనిలో ఉడికించినప్పుడు లోహం ఆహారంలో కరుగదు. కాబట్టి దీనిలో ఉడికించుకొని తినడం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు. కానీ అందరూ ఎక్కువగా ధర తక్కువ, వంట తొందరగా అవుతుంది అని అల్యూమినియం కుక్కర్ నే ఎంపిక చేసుకుంటున్నారు. మన ఆరోగ్యానికి మంచిది కావాలి అనుకుంటే స్టీల్ కుక్కర్ ను వాడడం మంచిది.
Also Read : AlBukhara Fruit : ఆల్‌బుకర పండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?