Ginger Pickle : ఇడ్లీ, దోసలకు తినే అల్లం పచ్చడి.. సింపుల్ గా ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసా?
అల్లం పచ్చడి మన ఆరోగ్యానికి మంచిది. అల్లం(Ginger) తినడం వలన మనకు జలుబు, దగ్గు వంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి.
- By News Desk Published Date - 11:00 PM, Mon - 6 November 23

మనం ఇడ్లీ, దోసె ఇలా రకరకాల టిఫిన్లకు(Tiffin’s) అల్లం పచ్చడి పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అల్లం పచ్చడి మన ఆరోగ్యానికి మంచిది. అల్లం(Ginger) తినడం వలన మనకు జలుబు, దగ్గు వంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. అల్లం తినడం వలన తిన్నది ఈజీగా అరుగుదల అవుతుంది.
అల్లం పచ్చడికి(Ginger Pickle) కావలసిన పదార్థాలు..
* అల్లం వంద గ్రాములు
* ఉప్పు తగినంత
* ఎండుమిర్చి 25 గ్రాములు
* ఆవాలు కొద్దిగా
* మెంతులు కొద్దిగా
* చింతపండు 50 గ్రాములు
* ఇంగువ కొద్దిగా
* బెల్లం 50 గ్రాములు
* నూనె సరిపడా
అల్లం శుభ్రంగా కడిగి దాని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తడి పోయేవరకు ఆరబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె లేకుండా మెంతులను, ఎండుమిర్చి, ఆవాలు దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తరువాత దానిని మిక్సీ పట్టుకోవాలి. దానిని పక్కన పెట్టుకొని మిక్సి గిన్నెలో అల్లం ముక్కలు, చింతపండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెల్లం వేసి మళ్ళీ మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో పైన తయారుచేసుకున్న మెంతులు, ఎండుమిర్చి, ఆవాల పొడిని కలుపుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
అనంతరం నూనెలో తాళింపులు, కొద్దిగా ఇంగువ వేసి చల్లార్చిన తరువాత దానిలో మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడి వేస్తే రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయినట్లే.
Also Read : Oil Free Chicken Fry : డైట్ లో ఉన్నారా ? ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై ఇలా చేయండి..