CM Yogi Plane : సీఎం యోగి విమానంలో సాంకేతిక సమస్య..ఎమర్జెన్సీ ల్యాండింగ్
CM Yogi Plane : ఆగ్రా పర్యటన ముగించుకున్న మధ్యాహ్నం 3.40 గంటలకు లక్నో తిరుగు ప్రయాణం కానుండగా, టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది
- By Sudheer Published Date - 09:02 PM, Wed - 26 March 25

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానం (Chartered plane)లో సాంకేతిక లోపం (Technical Error) తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది. ఆగ్రా పర్యటన ముగించుకున్న మధ్యాహ్నం 3.40 గంటలకు లక్నో తిరుగు ప్రయాణం కానుండగా, టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు.
Airtel IPTV : ఎయిర్‌టెల్ ఐపీటీవీ.. ఏమిటిది ? అన్ని ఫీచర్లా ?
ఈ అనుకోని పరిస్థితి వల్ల సీఎం యోగి కొంతసేపు విమానాశ్రయంలోనే వేచిచూడాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు సాధారణంగా అప్రమత్తత అవసరమైనవే అయినప్పటికీ, సీఎం ప్రయాణిస్తున్న కారణంగా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితిని పరిశీలించిన అధికారులు వెంటనే యోగి ఆదిత్యనాథ్ కోసం మరో విమానాన్ని ఏర్పాటుచేశారు. ఢిల్లీ నుండి ప్రత్యామ్నాయ విమానం పంపించడంతో, ఆయన సుమారు గంటన్నర సేపు ఆగ్రా విమానాశ్రయ లాంజ్‌లో వేచిచూశారు.
ప్రత్యామ్నాయ విమానం చేరుకున్న వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోకు బయలుదేరారు. విమానంలో ఉన్న సాంకేతిక లోపం కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అందరు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ అధికారులు, సిబ్బంది సీఎం కు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన తర్వాత అధికారిక వర్గాలు విమాన సాంకేతిక సమస్యలను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయనున్నట్లు సమాచారం.