Airtel IPTV : ఎయిర్‌టెల్ ఐపీటీవీ.. ఏమిటిది ? అన్ని ఫీచర్లా ?
టీవీ సీరియళ్లను వేళకు చూడలేని వారు.. ఐపీటీవీ(Airtel IPTV) ద్వారా తమకు అనువైన సమయంలో, అనువైన చోట వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
- By Pasha Published Date - 08:35 PM, Wed - 26 March 25

Airtel IPTV : ఐపీటీవీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ఇంటర్నెట్ ద్వారా టీవీ ఛానళ్లను చూసే సౌకర్యాన్ని ఐపీటీవీ కల్పిస్తుంది. కేబుల్ టీవీ, డీటీహెచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైఫై, ఓటీటీ, టీవీ ఛానళ్ల సర్వీసులను కలిపేసి ఐపీటీవీ సర్వీసును అందిస్తారు. తమ ఐపీటీవీ సేవలను దేశంలోని 2వేల నగరాలకు విస్తరించామని ఎయిర్‌టెల్ వెల్లడించింది. త్వరలో ఢిల్లీ, రాజస్థాన్, అసోం, పలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను తీసుకొస్తామని తెలిపింది. ఇందులో భాగంగా వైఫై సర్వీసులతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+, సోనీలివ్, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌తో పాటు 600 టీవీ ఛానళ్లను అందిస్తామని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ ప్లాన్లు రూ.699 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కనెక్షన్ బుక్ చేసుకునే వారికి ప్రారంభ ఆఫర్ కింద 30 రోజుల పాటు ఉచితం సర్వీసులు ఇస్తామని చెప్పింది.
Also Read :Bank Account Nominees : ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం
ఐపీటీవీ ప్లాన్లు
- రూ.699- 40 Mbps ఇంటర్నెట్, 26 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానళ్లు
- రూ.899- 100 Mbps ఇంటర్నెట్, 26 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానళ్లు
- రూ.1099- 200 Mbps ఇంటర్నెట్, 28 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానళ్లు
- రూ.1599- 300 Mbps ఇంటర్నెట్, 29 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానళ్లు
- రూ.3999- 1 Gbps ఇంటర్నెట్, 29 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానళ్లు
- వీటిలో రూ.699 ప్లాన్‌కు ఎక్కువ ప్రజాదరణ లభించే అవకాశాలు ఉన్నాయని ఎయిర్ టెల్ అంచనా వేస్తోంది. దేశంలోని సగటు కుటుంబాలు ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకునేందుకు ముందుకు వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది.
Also Read :Telangana New Ministers : తెలంగాణ కొత్త మంత్రులు వీరే..శాఖలు ఇవే !
ఐపీటీవీ ప్రయోజనాలివీ..
- టీవీ సీరియళ్లను వేళకు చూడలేని వారు.. ఐపీటీవీ(Airtel IPTV) ద్వారా తమకు అనువైన సమయంలో, అనువైన చోట వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇందుకోసం ఏ డివైజ్‌ను అయినా వాడొచ్చు.
- కొన్ని ఉచిత, పెయిడ్ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ లభిస్తుంది.
- పాజ్, రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ వంటి ఆప్షన్లు లభిస్తాయి.
- సెట్ టాప్ బాక్స్ లాంటి హార్డ్ వేర్ అవసరం ఉండదు.
- అదనపు క్లౌడ్ స్టోరేజీ ఫీజులు ఉండవు.
- 4కే స్ట్రీమింగ్‌తో హైబిట్రేట్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది.