New Parliament Inauguration: పార్లమెంటును బహిష్కరించడం అమరుల త్యాగాలను అవమానించడమే: రామ్‌దేవ్
దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై విపక్షాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 02:29 PM, Sat - 27 May 23

New Parliament Inauguration: దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ (New Parliament) భవనంపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై విపక్షాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని మోడీ ప్రారంభించబోయే కొత్త పార్లమెంట్ భవన కార్యక్రమాన్ని బైకాట్ చేశాయి విపక్ష పార్టీలు. దీంతో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 20కి పైగా ప్రతిపక్ష పార్టీలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా ఈ విషయమై యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Ramdev baba) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చారిత్రాత్మకమైన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని బాబా రామ్‌దేవ్ అన్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. పార్లమెంటు కేవలం భవనం మాత్రమే కాదని, ప్రజాస్వామ్య దేవాలయమని బాబా రామ్‌దేవ్ అన్నారు. దాన్ని బహిష్కరిస్తే ప్రజాస్వామ్యం గౌరవం పడిపోతుంది. ఎందరో బలిదానాల వల్ల మనకు స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలకు పార్లమెంటు గౌరవ కేంద్రమని అన్నారు. పార్లమెంటును బహిష్కరించడం ఆ త్యాగాలను అవమానించడమే అవుతుంది అంటూ పేర్కొన్నారు.
Read More: Stop Phone Ads : ఒక్క సెట్టింగ్.. ఫోన్‌లో యాడ్స్ కు గుడ్ బై