Powerful Passports : పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితా రిలీజ్.. ఇండియా ర్యాంకు ఎంత అంటే..
2024 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా విడుదలైంది.
- By Pasha Published Date - 12:03 PM, Wed - 24 July 24

Powerful Passports : 2024 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలతో ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇందులో ఇండియా ర్యాంకు ఎంత ? ఏ దేశం ఏ స్థానంలో ఉంది ? అనే దానిపై వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
- ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ ప్రకారం.. శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల(Powerful Passports) జాబితాలో భారత్ 82వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే భారత్ మూడు ర్యాంకులు ఇంప్రూవ్ అయింది. అంతకుముందు రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 85వ స్థానం వచ్చింది.
- 82వ ర్యాంకులో భారత్‌తో పాటు సెనెగెల్, తజకిస్థాన్ దేశాలు కూడా ఉన్నాయి.
- భారతదేశ పాస్‌పోర్టుతో(Indian Passport) ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి 58 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు. గతంలో ఈ సంఖ్య 59 ఉండగా, ఇప్పుడది 58కి తగ్గింది.
- ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు సింగపూర్‌ది అని నివేదిక తెలిపింది.
- సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 195 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.
- ఈ జాబితాలో రెండో స్థానంలో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 192 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.
- మూడో స్థానంలో ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి. ఈ పాస్‌పోర్టులతో 191 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.
- ఈ జాబితాలో 8వ స్థానంలో అమెరికా పాస్‌పోర్టు ఉంది. అమెరికా పాస్‌పోర్టుతో 186 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.
- పాకిస్తాన్ పాస్‌పోర్టు 100వ స్థానంలో ఉంది. దానితో 33 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.
- ఈ జాబితాలో 103వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్టు ఉంది. దానితో 26 దేశాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.
- నాలుగో స్థానంలో బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
- ఐదో స్థానంలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
- ఆరో స్థానంలో గ్రీస్, పోలాండ్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
- ఏడో స్థానంలో కెనడా, చెకియా, హంగరీ, మాల్టా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
- తొమ్మిదో స్థానంలో ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
- పదో స్థానంలో ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.