HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Woman Fights Off Leopard Ups Bijnor To Save 10 Year Old Son

Leopard: కొడుకు కోసం చిరుతతో తల్లి పోరాటం.. ఎక్కడంటే..?

బిజ్నోర్‌లో ఓ తల్లి తన బిడ్డను కాపాడేందుకు చిరుతపులి (Leopard)తో పోరాడింది. బిడ్డను రక్షించే వరకు ఆ తల్లి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో తల్లికి కూడా గాయాలయ్యాయి. దాదాపు ఏడు నిమిషాల పాటు చిరుతపులితో కొడవలితో పోరాడింది.

  • Author : Gopichand Date : 15-02-2023 - 1:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Another Leopard
Leopard 1280x720 1

బిజ్నోర్‌లో ఓ తల్లి తన బిడ్డను కాపాడేందుకు చిరుతపులి (Leopard)తో పోరాడింది. బిడ్డను రక్షించే వరకు ఆ తల్లి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో తల్లికి కూడా గాయాలయ్యాయి. దాదాపు ఏడు నిమిషాల పాటు చిరుతపులితో కొడవలితో పోరాడింది. కొడుకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నగీనా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిత్‌పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓంప్రకాష్‌ భార్య ఇతరులతో కలిసి చెరకు తొక్కేందుకు పొలానికి వెళ్లింది. కొడుకు టికేంద్ర కూడా ఆమెతో ఉన్నాడు. కొడుకు కాస్త దూరంగా కూర్చుని ఉండగా ఒక్కసారిగా చిరుతపులి వచ్చింది.

కుమారుడిని చిరుతపులి చెరుకుతోటకు ఈడ్చుకెళ్లిందని మహిళ తెలిపింది. ఇది చూసి కూలీలు పరుగులు తీశారు. సాయం చేయడానికి ఎవరూ రాలేదు. ఆ మహిళ చేతిలో కొడవలి (చెరకు ఒలిచే ఆయుధం) ఉంది. దాన్ని తీసుకుని రంగంలోకి దిగింది. కొడుకు కేకలు వేయడంతో చిరుతపులి తన నోటితో కొడుకు మెడను నొక్కింది. కొడవలితో చిరుతపులిపై మహిళ దాడి చేసింది. మహిళపై కూడా చిరుతపులి దాడి చేసింది. మహిళ కొడవలితో చిరుతపులి మెడపై, పొట్టపై పలుచోట్ల దెబ్బలు వేసింది. దీంతో చిరుత కుమారుడిని వదిలి పారిపోయింది.

Also Read: Twitter CEO: ట్విట్టర్​ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క

మహిళ సాహసంతో పులి పారిపోయాక.. తీవ్ర గాయాలపాలైన కొడుకును తీసుకుని ఆమె ఒంటరిగా పొలం నుండి బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కొడుకు టికేంద్ర తల, చేతులు, కడుపు, మెడపై లోతైన గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాలుడిని నగినాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. నగీనా హెల్త్ కేర్ సెంటర్ సెంటర్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ.. బాలుడి తల, మెడ, కడుపులో గాయాలు ఉన్నాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నందున, అతన్ని బిజ్నోర్ జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడ నుండి చికిత్స కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BIJNOR
  • leopard
  • UP News
  • uttarpradesh

Related News

    Latest News

    • నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!

    • ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

    • విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

    • రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

    • ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

    Trending News

      • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd