GST Effect : గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందా?
GST Effect : GST శ్లాబుల మార్పులో గ్యాస్ ధరలు తగ్గకపోవడం కొంత నిరాశ కలిగించినా, ఇతర నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం కొంత ఉపశమనం ఇస్తుంది
- By Sudheer Published Date - 06:31 PM, Sat - 20 September 25

దేశంలో కొత్త GST శ్లాబులు (GST Slabs) ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో అనేక నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. ఫలితంగా వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పుతో సాధారణ వినియోగదారులపై కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, గృహ అవసరాలకు సంబంధించిన కొన్ని వస్తువులపై GST తగ్గించడం వల్ల వినియోగదారులకు లాభం చేకూరుతుంది.
Cyber Attack on Airports : విమాన సర్వీసులపై ఎఫెక్ట్
అయితే సామాన్యుడి రోజువారీ జీవితంలో కీలకమైన వంటగ్యాస్ సిలిండర్ (Cooking gas cylinder) ధరపై మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై 5% GST, కమర్షియల్ సిలిండర్‌పై 18% GST కొనసాగుతూనే ఉన్నాయి. GST సవరణల్లో గ్యాస్ సిలిండర్లపై మార్పు లేకపోవడంతో ధరలు యథాతథంగానే ఉండనున్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.905గా ఉండగా, ఇది GST స్లాబుల మార్పుతో ప్రభావితం కాకపోవడం స్పష్టమైంది. దీంతో గ్యాస్ ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారుల ఆశలు నెరవేరకపోయాయి.
సాధారణ ప్రజల జీవన వ్యయాల్లో వంటగ్యాస్ ధరలు ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో ఇంధన ధరలు పెరగడం వల్ల గృహిణులు అదనపు భారాన్ని ఎదుర్కొన్నారు. GST శ్లాబుల మార్పులో గ్యాస్ ధరలు తగ్గకపోవడం కొంత నిరాశ కలిగించినా, ఇతర నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం కొంత ఉపశమనం ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో గ్యాస్ ధరలను సబ్సిడీ లేదా పన్ను తగ్గింపు రూపంలో తగ్గించే అవకాశాలున్నప్పటికీ, ప్రస్తుతానికి GST మార్పులు ఆ ప్రయోజనాన్ని ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది.