Goutham Adani Wife: గౌతమ్ అదానీ భార్య ఎవరు? పెళ్లికి ముందు ఆమె ఏ జాబ్ చేశారంటే..?
ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ (Goutham Adani) తన భార్య , డాక్టర్ ప్రీతి అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పారు. పెళ్లి చూపులు జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రీతి డెంటిస్ట్ వృత్తిని వదులుకొని అదానీ ఫౌండేషన్‌లో చేరి దాన్ని డెవలప్ చేసిన విధాన్ని వివరించారు.
- By Gopichand Published Date - 06:55 AM, Sat - 4 February 23

ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ (Goutham Adani) తన భార్య , డాక్టర్ ప్రీతి అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పారు. పెళ్లి చూపులు జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రీతి డెంటిస్ట్ వృత్తిని వదులుకొని అదానీ ఫౌండేషన్‌లో చేరి దాన్ని డెవలప్ చేసిన విధాన్ని వివరించారు. పూర్తి వివరాలు గౌతమ్ అదానీ మాటల్లో.. “మా ఇద్దరి పెళ్లి కుటుంబ పెద్దలు నిశ్చయించిందే. పెళ్లి చూపులు టైంలో ప్రీతిని చూసి.. నోరు పెగల లేదు. ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ టైంలో ఆమెతో మాట్లాడేందుకు నాకు ధైర్యం చాలా లేదు. నేనేమో నిరక్షరాస్యుడిని.. ఆమేమో డాక్టర్.. సహజంగానే మా ఇద్దరికి కొద్దిగా సరిపోలలేదు. ఆ ఆత్మ న్యూనతా భావన వల్ల పెళ్లి చూపులు వేళ ఆమెను చూశాక నా నోరు తెరుచుకోలేదు” అని గౌతమ్ అదానీ చెప్పారు.
నా జీవితపు మూల స్తంభం
“ప్రీతి ముంబైలో పుట్టింది. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చదివింది. అయితే 1996లో మా ఇద్దరి పెళ్లి తర్వాత.. నా రిక్వెస్ట్ వల్లే ఆమె డాక్టర్ కెరీర్ వదులుకున్నారు. ప్రీతి అదానీ నా పురోగతి కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టారు. నేను చెప్పిన మాట విని అదానీ ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా మారారు. అందుకే నా భార్య ప్రీతి అదానీ నా జీవితపు మూల స్తంభం అని నిస్సంకోచంగా చెబుతాను. నేను ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ప్రీతి పాత్ర ఎంతో కీలకం” అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.
ఏటా 32 లక్షల మందికి సాయం
“ఈ రోజు ప్రీతి మా ఫౌండేషన్ కోసం గరిష్టంగా పని చేస్తుంది. రోజూ 7-8 గంటలు ఫౌండేషన్ కోసం ఇస్తుంది. ప్రీతి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చాలా అభివృద్ధి చెందింది.అదానీ ఫౌండేషన్‌ను స్థాపించినప్పుడు ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కానీ నేడు భారతదేశం అంతటా ఏటా 32 లక్షల మందికి మా ఫౌండేషన్ సహాయం చేస్తోంది. దీని విస్తరణలో ప్రీతీ అదానీ పెద్ద హస్తం ఉంది. మా ఫౌండేషన్ నాలుగు ప్రధాన రంగాలలో పనిచేస్తుంది. అవి.. విద్య, సమాజ ఆరోగ్యం, స్థిరమైన జీవనోపాధి అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి” అని గౌతమ్ అదానీ వివరించారు. “నేను వారానికి మూడు రోజులు అహ్మదాబాద్‌లో ఉంటున్నాను. నాలుగు రోజులు నగరంలో ఉన్నప్పుడు, నా కుటుంబానికి సమయం ఇవ్వడానికి ఆలస్యంగా ఆఫీసుకు వెళ్తాను. రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రీతితో రమ్మీ, కార్డ్ గేమ్స్ ఆడతాను. చాలాసార్లు ఆమె గెలుస్తుంది” అని చెప్పారు.
Also Read: Eye Drops: అప్పుడు దగ్గు మందు.. ఇప్పుడు కంటి చుక్కల మందు.. ప్రాణాలకు ముప్పు!
ఫౌండేషన్ నిర్వహణ కాకుండా ప్రీతి ఏం చేస్తుంది?
ప్రీతి తన ఎక్కువ సమయాన్ని ఫౌండేషన్‌కే కేటాయిస్తుంది. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఇష్ట పడుతుంది. స్టార్టప్‌ల కొత్త ఆలోచనలు తనకు స్ఫూర్తిని ఇస్తాయని ఆమె అంటారు. ప్రీతికి గార్డెనింగ్ అంటే కూడా చాలా ఇష్టం. తన భర్త గౌతమ్ అదానీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫోటోను ప్రీతి ట్వీట్ చేస్తూ..’36 ఏళ్లకు పైగా గడిచింది.. నా కెరీర్‌ని పక్కన పెట్టి, గౌతమ్ అదానీతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనంటే నాకు ఎనలేని గౌరవం, గర్వం కలుగుతుంది.నేను నిరాశకు గురైనప్పుడల్లా గౌతమ్ అదానీ నన్ను ప్రోత్సహిస్తారు. ఎలాంటి సమస్య నుంచైనా బయటపడేందుకు గొప్ప ఆలోచనలు ఇస్తాడు. డెంటిస్ట్‌గా మారడం ద్వారా కొందరికి మాత్రమే సేవ చేయగలనని, అయితే ఫౌండేషన్‌లో చేరడం ద్వారా లక్షలాది మందికి సేవ చేయగలనని గ్రహించే కెరీర్‌ను విడిచిపెట్టానని ఆమె చెప్పారు.