Lose Weight: ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. బరువు తగ్గడానికి చెమటలు చిందిస్తూ కష్టపడాల్సిన పని లేద
ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ని ఉదయాన్నే తాగితే చాలు కష్టపడకుండా చెమటలు చిందించకుండానే ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారో ఆరోగ్య నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:16 PM, Wed - 7 May 25

బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్లో గంటల తరబడి కష్టపడుతూ ఎక్సర్సైజులు చేస్తూ చెమటలు చిందిస్తూ తెగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఇకమీదట అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు ఈజీగా బరువు తగ్గవచ్చు అని అంటున్నారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో ఆ డ్రింక్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పైనాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పైనాపిల్ ఏడాది పొడవునా లభిస్తూ ఉంటుంది.
ఈ పండును తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వేసవిలో పైనాపిల్ వాటర్ తాగడం వల్ల బాడీ హైద్రేట్ అవుతుందని చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువ ఉండటం వల్ల సులువుగా జీర్ణం అవుతుంది. పైనాపిల్ వాటర్ తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఈ వాటర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతుందట. ఫిట్ నెస్ కోసం, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు క్రమం తప్పకుండా తాగితే ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా మెరిసిపోతుందట. వేసవిలో ఈ పైనాపిల్ వాటర్ తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుందట.
పైనాపిల్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి సులువుగా జీర్ణమైపోతుంది. ఈ పైనాపిల్ వాటర్ ని తయారు చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. కాగా పైనాపిల్ వాటర్ తయారీకి రెండు పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా తాజా పైనాపిల్ తీసుకోవాలి. పైన పొట్టు కట్ చేసి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే పైనాపిల్ పై ఉండే ఆకులను ముందుగా తుంచి చూడాలి. అవి సులువుగా విడిపోయాయంటే ఆ పండు తినేందుకు రెడీగా ఉందని అర్థం. అలాంటి పండునే సెలెక్ట్ చేసుకుని కట్ చేయాలి. ఒక పెద్ద గ్లాస్ లో నీళ్లు పోసి అందులో ఈ ముక్కలు వేయాలి.
చాలా సేపటి వరకూ వాటిని అందులోనే ఉంచాలట. ఎంత ఎక్కువ సేపు నీళ్లలో ఉంటే అంత ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. పైగా ఇలా ఎక్కువ సమయం ఉంచడం వల్ల పైనాపిల్ లోని ఫ్లేవర్ అంతా నీళ్లకు బాగా పడుతుందని చెబుతున్నారు. ఇలా ముక్కలు నానబెట్టిన ఈ నీళ్లను నేరుగా తాగవచ్చు. కాస్తంత చల్లగా ఉండాలి అనుకుంటే ఐస్ యాడ్ చేసుకోవచ్చట. రోజూ పరిగడుపునే ఈ నీళ్లు తాగితే చాలా మంచిదట. వీటిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, ఫైబర్ అధికంగా ఉంటాయట. సోడియం ఉండడం వల్ల ఎక్కువ సమయం పాటు ఈ నీళ్లు శరీరంలోనే ఉంటాయని చెప్తున్నారు. ఈ వాటర్ ని తరచుగా తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని చెబుతున్నారు..