Free Bus Scheme : మాకు ఫ్రీ బస్సు వద్దు..ఈ బాదుడు వద్దు – మహిళలు
Free Bus Scheme : ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్ (Free Bus Scheme) అంటూ చెబుతూనే.. మరొకవైపు టికెట్ ఛార్జీలను పెంచి ఆ భారం మాపై మోపుతున్నారు
- By Sudheer Published Date - 01:31 PM, Mon - 6 January 25

కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో (Karnataka RTC buses) టికెట్ ఛార్జీలను (Ticket Charges) 15% పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెంచుతుందని, దానితో జీవన స్థితిగతులు మరింత కష్టమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం సామాన్య ప్రజానీకం పై తీవ్రమైనదిగా ఉంటుందని పేర్కొంటున్నారు. పలువురు మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, తమకు ఫ్రీ బస్సు స్కీమ్ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
“ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్ (Free Bus Scheme) అంటూ చెబుతూనే.. మరొకవైపు టికెట్ ఛార్జీలను పెంచి ఆ భారం మాపై మోపుతున్నారు. మాకు ఈ స్కీమ్ అవసరం లేదు, చార్జీల భారం వద్దు” అంటూ తేల్చి చెపుతున్నారు. బస్సు ఫ్రీ అని చెప్పి , మా పురుషులకు టికెట్ చార్జీలు పెంచడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వారు కూడా మా కుటుంబ సభ్యులే, టికెట్ ఛార్జీల పెంపు కారణంగా ఆ భారాన్ని మా కుటుంబమే కదా మోయాల్సి వచ్చేది. ఇది మా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మరింత దెబ్బతీయడం కాకుండా మరేంటి అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఒక ప్రయోజనంగా చూపిస్తున్నప్పటికీ, ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోవడానికి టికెట్ ఛార్జీలను పెంచడం తగదని , ఇది ప్రజలపై ప్రత్యక్షంగా భారం మోపడం తప్ప ఇంకేం కాదు అని, ఫ్రీ ప్రయాణం అనే పేరు పెట్టి, టికెట్ ధరల పెంపుతో ఆ నష్టాలను మాపై మోపుతున్నారు అని ప్రజలు వాపోతూ..ఈ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో కూడా ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తున్నప్పటికీ , టికెట్ ధరలైతే పెంచలేదు. ఒకవేళ ఇక్కడ కూడా పెంచిస్తే కర్ణాటక ప్రజల మాదిరే భారం పడనుంది.
Read Also : China Virus : హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ మాత్రమే కాదు, ఈ వ్యాధులు చైనాలో కూడా విస్తరిస్తున్నాయి..!