Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. కొత్త సంవత్సరం రోజే నలుగురు మృతి
కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం మణిపూర్‌లో మళ్లీ హింస (Manipur Violence) చెలరేగింది.
- By Gopichand Published Date - 08:50 AM, Tue - 2 January 24
Manipur Violence: కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం మణిపూర్‌లో మళ్లీ హింస (Manipur Violence) చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా మంత్రుల అత్యవసర సమావేశాన్ని పిలిచారు. సమాచారం ప్రకారం ఈ ఘటన తౌబాల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో డబ్బులు వసూలు చేసేందుకు వచ్చారు. దాడి అనంతరం ఆగ్రహించిన ప్రజలు దాడి చేసిన వారి వాహనాలకు నిప్పు పెట్టారు. హింస, శాంతిని కాపాడాలని ముఖ్యమంత్రి వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు.
అమాయకులను చంపడం చాలా బాధ కలిగించిందని అన్నారు. నిందితులను కనుగొనడంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం జరిగేలా ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని హామీ ఇస్తున్నాను. ఈ మేరకు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశం కానున్నారు.
Also Read: Liquor Sale : న్యూఇయర్ రోజు ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఒక్కరోజే..?
ఈ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు
నివేదికల ప్రకారం.. ఘటన తర్వాత తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, విష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దీనికి రెండు రోజుల ముందు రాష్ట్ర సరిహద్దు పట్టణం మోరేలో అనుమానిత తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.