Vinesh Phogat: ఫుట్‌పాత్‌పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
- By Praveen Aluthuru Published Date - 09:35 PM, Sat - 30 December 23

Vinesh Phogat: డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డులను వెనక్కి తిరిగి చేసేందుకు వినేష్ శనివారం ప్రధాని కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా అధికారులు అక్కడికి చేరుకోకుండా ఆమెను అడ్డుకున్నారు.చివరికి ఖేల్ రత్న మరియు అర్జున అవార్డును ప్రధాని కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉంచింది.
అవార్డులను తిరిగి ఇచ్చేయడానికి గల కారణాలను ఆమె పునరుద్ఘాటించారు.డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు మద్దతిచ్చినందుకు గాను తన ఖేల్ రత్న మరియు అర్జున అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నట్లు ఆసియా మరియు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత వినేష్ ఫోగట్ ప్రకటించారు. అంతేకాకుండా ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ రెజ్లింగ్‌ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది, బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చినారు.
Also Read: Hyderabad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య