Rahul Gandhi: కూరగాయల వ్యాపారితో రాహుల్ భోజనం..
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి అనూహ్యంగా ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ఈ యాత్ర ద్వారా రాహుల్ ప్రజలకు మరింత చేరువయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 16-08-2023 - 5:22 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి అనూహ్యంగా ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ఈ యాత్ర ద్వారా రాహుల్ ప్రజలకు మరింత చేరువయ్యారు. మరీ ముఖ్యంగా కార్మికులకు చేరువవుతున్నారు. లారీ డ్రైవర్ల సమస్యలని తెలుసుకునేందుకు రాహుల్ స్వయంగా లారీ నడిపాడు. వందలాది కిలోమీటర్లు రాహుల్ లారీ నడుపుతూ కనిపించాడు. అలాగే బైక్ మెకానిక్ షెడ్డుకి వెళ్లి నట్లు బిగించాడు. హోటల్ లో సామాన్యులతో బ్రేక్ ఫాస్ట్ చేయడం ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. తాజాగా రాహుల్ ఓ కూరగాయల వ్యాపారీ రామేశ్వర్ తో కలిసి విందు చేశారు. స్వయంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆ వ్యాపారితో ముచ్చటించారు. ఆ తరువాత ఇద్దరు కలిసి విందు చేశారు. దీనికి సంబందించిన ఫోటోని రాహుల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. రామేశ్వర్ మాట్లాడుతూ.. తన ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ వచ్చిందని చెప్పాడు.
Also Read: Uttar Pradesh: పరమేశ్వరుడికి శిరస్సుని సమర్పించిన భక్తుడు.. ఎక్కడో తెలుసా?