HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >V D Satheesan Sworn In As Kerala Cm

Kerala CM: కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

  • Author : Vamsi Chowdary Korata Date : 18-05-2026 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
V.D. Satheesan Sworn In as Kerala CM
V.D. Satheesan Sworn In as Kerala CM

కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘన విజయం సాధించడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా, కేరళ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు, ఆదివారం సతీశన్ ప్రముఖ కార్డినల్ మోరన్ మోర్ బసిలియోస్ క్లెమిస్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కార్డినల్ క్లెమిస్ బావా అందించిన దీవెనలు, శుభాకాంక్షలు తనకు ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని సతీశన్ ఎక్స్ వేదికగా తెలిపారు. అన్ని వర్గాలను గౌరవిస్తూ, కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రితో కలిపి కొత్త మంత్రివర్గంలో 21 మంది సభ్యులు ఉండనున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి పదవి సహా కాంగ్రెస్‌కు 11 మంత్రి పదవులు దక్కనున్నాయి. మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు ఐదు మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. ఐయూఎంఎల్ నుంచి పీకే కున్హాలికుట్టి, కేఎం షాజీ, ఎన్. షంసుద్దీన్, పరక్కల్ అబ్దుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, పీకే బషీర్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • kerala chief minister
  • Kerala politics
  • rahul gandhi
  • UDF
  • VD Satheesan

Related News

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd