Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్
- Author : Latha Suma
Date : 28-03-2024 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
Taj Mahal: తాజ్‌మహల్ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ (Ajay Pratap Singh) ఈ దావా వేశారు. ప్రస్తుతం తాజ్ మహల్‌లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోర్టును కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజ్‌మహల్‌గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని పేర్కొంటూ పిటిషనర్ వివిధ చారిత్రక పుస్తకాలను ఉదహరించారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 9న విచారణ జరగనుంది. ఇదిలాఉంటే.. తాజ్ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.
Read Also: Sleeping On Currency : కరెన్సీ నోట్లతో పొలిటీషియన్ నిద్ర.. ఫొటోలు వైరల్
ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా కూడా తాజ్‌మహల్‌ను “పురాతన శివాలయం”గా పేర్కొంటూ హిందూ పూజలు నిర్వహించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘యోగి యూత్ బ్రిగేడ్’ పిటిషన్ దాఖలు చేసింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజ్‌మహల్‌కు గంగాజలంతోపాటు జలాభిషేకం కూడా అందించాలని పిటిషన్‌లో కోరారు. తాజ్ మహల్ నిజానికి “శివాలయం, దీని పేరు తేజో మహాలయ శివాలయం” అని పిటిషనర్లు పేర్కొన్నారు.