Upasana: ప్రధానితో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి కోడలు
ప్రధాని నరేంద్రమోదీతో మెగా ఫ్యామిలీ కోడలు,అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొనిదెల ఉపాసన భేటీ అయ్యారు.
- By Siddartha Kallepelly Published Date - 10:58 PM, Wed - 22 December 21

ప్రధాని నరేంద్రమోదీతో మెగా ఫ్యామిలీ కోడలు,అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొనిదెల ఉపాసన భేటీ అయ్యారు.
ఇండియన్ ఎక్స్‌పో 2020 సమావేశం కోసం ఉపాసన ప్రధానితో భేటీ అయ్యారని తెలుస్తోంది. ప్రధానితో తాను సమావేశమైనట్లు సోషల్ మీడియా వేదికగా ఉపాసన తెలిపింది. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ఉపాసన తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు.
ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నానని, ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలని, టెక్నాలజీ మనకు ఎన్నో అవకాశాలని ఇస్తుందని,దానిని తెలివిగా ఉపయోగించుకోవాలని ఉపాసన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లోనే దుబాయ్ ఎక్స్‌పో 2020ని కూడా ఉపాసన ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా తాను తీసుకున్న ఫొటోను షేర్ చేశారు.
U can meet @PMOIndia @narendramodi ji too at the @IndiaExpo2020 @expo2020dubai https://t.co/wMw2dh9Tvo
— Upasana Konidela (@upasanakonidela) December 22, 2021