Budget 2025 : ధరలు పెరిగేవి.. ధరలు తగ్గేవి ఇవే..
ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణం, పన్నుల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది. అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి.
- Author : Latha Suma
Date : 01-02-2025 - 1:46 IST
Published By : Hashtagu Telugu Desk
Budget 2025 : లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ యువత, మహిళలపై దృష్టి సారించింది. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రధానంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి, రైతులకు ఒక ప్రత్యేక బహమతిని కూడా ఇచ్చింది. ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణం, పన్నుల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది. అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి. దాంతో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని వాటి ధరలు తగ్గుతాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేటి ధరలు తగ్గుతాయి..
.క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులు
.ప్రాణాలను రక్షించే మందులు
.ఫ్రోజెన్ చేపలు
.ఎలక్ట్రిక్ వాహనాలు
.చేపల పేస్ట్
.లెదర్ ఉత్పత్తులు
.క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
.12 కీలకమైన ఖనిజాలు
.ఓపెన్ సెల్
.భారతదేశంలో తయారైన దుస్తులు
.మొబైల్ ఫోన్లు
.తోలు వస్తువులు
.వైద్య పరికరాలు
.ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు
వేటి ధరలు పెరుగుతాయంటే..
.ఫ్లాట్ ప్యానెల డిస్ ప్లేల ధరలు పెరుగుతాయి.
.సిగరెట్ల ధరలు పెరుగుతాయి.
కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండనున్నట్లు వెల్లడించారు. 2025-26 బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించారు. శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ. 55 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
Read Also: Budget 2025: బడ్జెట్ 2025.. రియల్ ఎస్టేట్, స్టార్టప్ కంపెనీల వృద్ధికి కీలక ప్రకటన!