HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ukraine The Only Destination For Movies And Studies

Ukraine: సినిమాలకు, చదువులకు ఒకే కేరాఫ్.. దటీజ్ ఉక్రెయిన్

  • Author : Hashtag U Date : 27-02-2022 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukraine
Ukraine

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రాగానే ఇండియాలో కలవరం మొదలైంది. ఉక్రెయిన్‌లో చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్ధులు ఏకంగా 23వేల మంది ఉన్నారు. అన్ని వేల మంది తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలైంది. యుద్ధానికి ముందే తట్టాబుట్టా సర్దుకుని కొంత మంది వచ్చేశారు.

ఉక్రెయిన్ లో ఇంకా దాదాపు 18వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఒకేసారి అంతమందిని తీసుకురావడం కష్టమే అయినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తనవంతు ప్రయత్నం చేస్తోంది. కాని, ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఉక్రెయిన్‌లో అన్ని వేల మంది భారతీయ విద్యార్ధులు చదువుతున్నారా అని.

అసలు ఉక్రెయిన్‌లో ఏముందని అంత దూరం వెళ్లారని ఆరా తీస్తున్నారు. వస్తున్న సమాధానాలు చూస్తుంటే.. అర్రెర్రె అంత మంచి అవకాశం ఇక పోయినట్టేనా? మళ్లీ అలాంటి రోజులు రావా అన్న ఆందోళన కలుగుతుంది. ఇంతకీ, ఉక్రెయిన్‌లో భారత విద్యార్ధులకు దొరికి అడ్వాంటేజ్ ఏంటి?

ఫారెన్ కంట్రీలో.. అందులోనూ మెడిసిన్ చదువుకునే అవకాశం వస్తే వదులుకుంటారా? ఉక్రెయిన్‌లో చదువుకునేందుకు పోటీ ప్రధాన కారణం ఇదే. మెడిసిన్ పూర్తి చేస్తే ఫారిన్‌లో చదువుకున్నాడన్న పేరు వస్తుంది. అందులోనూ ఉక్రెయిన్ కాలేజీలు ఇచ్చే సర్టిఫికెట్లకు ఇండియాలో వాలిడిటీ ఉంది. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉక్రెయిన్ డిగ్రీకి విలువ ఉంది.

ఉక్రెయిన్ కాలేజీలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు ఉంది. దీంతో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ సర్టిఫికెట్‌ను యాక్సెప్ట్ చేస్తారు. పైగా డాక్టర్ కోర్సు పూర్తి చేసిన వారికి యూరప్‌లో పర్మినెంట్ రెసిడెంట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. అందుకే ఉక్రెయిన్ ను ఎక్కువమంది సెలక్ట్ చేసుకుంటారు.

పైగా ఇండియాలో మెడిసిన్ చదవాలంటే ఎంసెట్ అని, నీట్ అని ఇలా పరీక్షలు రాయాలి. అందులో ర్యాంక్ వస్తేనే మెడిసిన్ చదువు. లేదంటే మేనేజ్‌మెంట్ కోటాలో కొనుక్కోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటికి పైనే పెట్టాలి. కాని, ఉక్రెయిన్‌లో అలా కాదు.. ఏడాదికి ఖర్చులన్నీ కలిపి కేవలం ఓ ఐదారు లక్షల్లో అవుతుందంటారు. ఎక్కువలో ఎక్కువ అర కోటి కన్నా ఎక్కువ ఖర్చు కాదు.

ఖర్కీవ్, సుమీ లాంటి ప్రాంతాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువేనన్నది అక్కడ చదువుతున్న విద్యార్ధులు చెబుతున్నారు. ఉక్రెయిన్ వెళ్లడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. అక్కడ ఓ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే చాలు.. మెడిసిన్‌లో సీటు వచ్చేస్తుంది. ఇంటర్‌లో 70 శాతం, 80 శాతం మార్కులు సాధించిన వాళ్లకి ఒక్కోసారి ర్యాంక్ రాకపోవచ్చు.

మార్కులు తక్కువ వచ్చినా సరే.. అలాంటివాళ్లు ఉక్రెయిన్‌లో ట్రై చేస్తే మాత్రం ఈజీగా పాస్ అయిపోతున్నారు. ఇంత మంచి సౌలభ్యం ఉండడం, తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ పూర్తవుతుండడం, పైగా విదేశాల్లో చదువుకున్నాడనే పేరు.. ఇవన్నీ స్పెషల్ యాడ్ ఆన్స్. అందుకే, ఏకంగా 23వేల మంది విద్యార్ధులు ఉక్రెయిన్‌లో చదువు కోసం వెళ్లారు.

విద్యార్థులకే కాదు సినిమా వాళ్లకు కూడా ఉక్రెయిన్ హాట్ డెస్టినేషన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలవగానే రాజమౌళి ట్రిపుల్ఆర్ సినిమా అక్కడే షూటింగ్ జరుపుకుందట అనే వార్త తెగ పాపులర్ అయింది. లిస్ట్ చూస్తే చాలా ఇండియన్ సినిమాలు అక్కడి లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకున్నాయి.

ఇంతకీ, ఉక్రెయిన్ స్పెషాలిటీ ఏంటని అడిగితే మొదటగా చెప్పేది అక్కడి భౌగోళిక అందాలు. ఏ దర్శకుడికైనా ముందుగా కావాల్సింది లొకేషన్. డైరెక్టర్ కోణాన్ని ఆవిష్కరించే అద్భుతమైన లొకేషన్స్ ఉక్రెయిన్‌లో ఉన్నాయి. సినిమా వాళ్లు లొకేషన్ తరువాత చూసేది బడ్జెట్. రిచ్‌గా కనిపించాలి కాని ఎక్కువ కాస్ట్ అవకూడదు. అలాంటి వాళ్లకి బెస్ట్ డెస్టినేషన్ ఉక్రెయిన్.

సినిమా షూటింగుల కోసమే ఇక్కడ మౌలిక వసతులు, సినిమాకు కావాల్సిన వివిధ విభాగాల సిబ్బందిని తయారుచేస్తున్నారు. ఉక్రెయిన్‌లో 200లకు పైగా ప్రొడక్షన్ కంపెనీలు, ఫిల్మ్ స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, విజువల్ ఎఫెక్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పైగా ఇక్కడే ప్రపంచలోని లార్జెస్ట్ స్టూడియోస్‌లో ఒకటైన ఫిల్మ్ డాట్ యూఏ కూడా ఉంది.

ఉక్రెయిన్లో ఫారెనర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్లు షూటింగ్‌కు ఛార్జ్ చేసేది కూడా తక్కువే. యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, అమెరికా పౌరులకు వీసా అక్కర్లేదు. మూడు నెలల పాటు స్పెషల్ పర్మిషన్‌తో ఉక్రెయిన్‌లో ఉండిపోవచ్చు. పైగా ఉక్రెయిన్ లొకేషన్లలో షూటింగ్ జరుపుకునే వారికి 30 శాతం రిబేట్ కూడా ఇస్తున్నారు.

ఇక ట్రాన్స్ పోర్టేషన్ పరంగానూ మెరుగ్గా ఉంటుంది. రాజధాని కీవ్‌లో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు సులువుగా చేరుకునే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌లో వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. శీతాకాలంలో మైనస్ 20 డిగ్రీలు చలి ఉంటుంది. మిగతా కాలాల్లో అంతగా చలి ఉండదు. ఇన్ని సౌలభ్యాలు ఉన్న కారణంగానే సినిమా షూటింగులకు వస్తుంటారు. కేవలం ఇండియన్సే కాదు హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటుంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • russia
  • Russia-Ukraine War
  • ukraine
  • Ukraine Russia Crisis

Related News

Putin Vs Trump

అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

  • ధూమపాన ప్రియులకు షాక్..

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd