HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Uddhav Thackeray Is Unwell Shifted To Hospital

Uddhav Thackeray : ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Uddhav Thackeray : గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు.

  • Author : Latha Suma Date : 14-10-2024 - 4:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uddhav Thackeray is unwell, shifted to hospital
Uddhav Thackeray is unwell, shifted to hospital

Reliance Hospital: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. ఆయన గుండెలో అడ్డంకులు ఉన్నట్లు.. ఈరోజే యాంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

Read Also: PM Modi : ప్రధాని మోడీని కలిసిన ఢిల్లీ సీఎం అతిశీ

ఉద్ధవ్ థాకరే మొదటిసారిగా 20 జూలై 2012న యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ ఏడాది నవంబర్‌లో యాంజియోప్లాస్టీ చేయించుకోవలసి వచ్చింది. అక్టోబర్ 12న జరిగిన దసరా ర్యాలీ తర్వాత ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అంతకుముందు 2016లో కూడా థాకరే ముంబయిలోని లీలావతి హాస్పిటల్ లో యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ ఆసుపత్రిలో చేరగా.. ఈరోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్చని సమాచారం.

మరోవైపు ఈ వారమే మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

Read Also: TG IAS Officers : క్యాట్​ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్‌లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Angioplasty
  • Maharashtra
  • mumbai
  • Reliance Hospital
  • Uddhav Thackeray

Related News

'Meta Business Agent' AI tool released for business!

WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

WhatsApp Business Summit : ముంబై వేదికగా జరిగిన మూడవ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో వాట్సాప్ సంస్థ సరికొత్త విప్లవాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను పరిచయం చేసింది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, 24/7 కార్యకలాపాలను సాగించేందుకు వీలుగా ‘మెటా బిజినెస్ ఏజెంట్’ (Meta Business Agent) అనే సరికొత్త ఏఐ ఏజెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏఐ టూల్ ద్వారా ప్రతి చిన్న, పెద్ద వ్

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd