Operation Sindoor : మరో ఇద్దరు పాక్ సైనికులు మృతి
Operation Sindoor : భారత సైన్యం దెబ్బకు పాక్ సైనికులు పిట్టల్లా రాలిపోగా.. మరికొంతమంది గాయాలతో హాస్పటల్స్ లలో చికిత్స పొందుతూ చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు
- By Sudheer Published Date - 08:10 PM, Wed - 14 May 25

పాక్ పై భారత్ నిర్వహించిన వైమానిక దాడుల (Operation Sindoor) ప్రభావం పాకిస్థాన్ (Pakistan) సైనికులపై కొనసాగుతూనే ఉంది. భారత సైన్యం దెబ్బకు పాక్ సైనికులు పిట్టల్లా రాలిపోగా.. మరికొంతమంది గాయాలతో హాస్పటల్స్ లలో చికిత్స పొందుతూ చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఆ దాడుల్లో గాయపడ్డ మరో ఇద్దరు పాక్ జవాన్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి (Two more Pakistani soldiers die ) చెందినట్లు పాకిస్థాన్ సైనిక సమాచార విభాగం (DG ISPR) ప్రకటించింది. మృతులుగా మహమ్మద్ నవీద్ షాహీద్, అయాజ్ అనే జవాన్లు గుర్తించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కి చేరింది.
Indus Water : కాళ్ల బేరానికి పాకిస్థాన్..తగ్గేదేలే అంటున్న మోడీ
ఈ దాడుల్లో గాయపడిన సైనికుల సంఖ్య 78గా వెల్లడించింది. తొలి దశలో భారత్ చేసిన వైమానిక దాడులకు పాక్ తీవ్రంగా స్పందించినా, తమ సైనికులకు ఎలాంటి హాని జరగలేదని ఆరోపించింది. అయితే రోజులు గడుస్తున్నకొద్దీ మృతుల వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో, పాకిస్థాన్ ముందుగా చేసిన ప్రకటనలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్ నిజాలను బయటపెడుతూ వస్తుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ దాడులను సమర్థించగా, పాకిస్థాన్ వరుసగా తమ నష్టాలను అంగీకరిస్తుండటం, దాని వైఖరిపై విశ్లేషకుల్లో అనేక ప్రశ్నలు రేపుతోంది.