HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Turkey Sends Drones Weapons To Pakistan

India – Pak War : పాకిస్తాన్ కు డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని పంపిన టర్కీ

India - Pak War : పాకిస్థాన్ టర్కీ (Turkey)తో చేతులు కలిపి, అధునాతన డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని తెప్పించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం

  • Author : Sudheer Date : 09-05-2025 - 8:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Turkey Sends Drones, Weapon
Turkey Sends Drones, Weapon

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ను సార్ట్ చేసి…ఎక్కడిక్కడే ఉగ్రస్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టర్కీ (Turkey)తో చేతులు కలిపి, అధునాతన డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని తెప్పించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. మూడు సైనిక విమానాల ద్వారా టర్కీ పాక్‌కు ఆయుధాలను సరఫరా చేసినట్టు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే ఇస్లామాబాద్‌కు మరో టర్కీ మిలిటరీ విమానం చేరినట్లు సమాచారం అందుతుంది. కేవలం టర్కీ తోనే కాకుండా, చైనాతో కలిసి పాక్ అశాంతి సృష్టించే కుట్రలు పన్నుతోందని భారత భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

భారత్‌పై దాడులకు పాక్ సిద్ధమవుతున్న ఈ తరుణంలో, మన దేశ గగనతల రక్షణ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉంది. టర్కీ నుంచి వచ్చిన డ్రోన్లను హడావుడిగా కుదింపు చేసి భారత గగనతలంలోకి పంపించినా, మన వాయుసేన అలాంటి అన్ని డ్రోన్లను గుర్తించి వెంటనే ధ్వంసం చేసింది. పాక్ ప్రయత్నాలు పూర్తిగా విఫలమవడమే కాకుండా, వారి సాంకేతిక అవగాహనల లోపం బయటపడింది. వాయుసేన ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ కారణంగా ఈ డ్రోన్లతో పాక్‌కు ఏ ప్రయోజనం కలగలేదు.

పాక్ అంతర్జాతీయంగా ఒంటరి పడిపోతున్న ఈ సమయంలో టర్కీ మద్దతు దేశ భద్రతకు నూతన సవాలుగా మారింది. టర్కీ, చైనా లాంటి దేశాలు పాక్‌కు ఆయుధ సహాయం అందిస్తుండటం పట్ల భారత భద్రతా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, భారత ప్రభుత్వం ఈ పరిస్థితులను గమనిస్తూ సంబంధిత దేశాలకు తగిన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్ దాడులపై భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India - Pak War
  • Operation Sindoor
  • pakistan
  • Turkey sends drones

Related News

The Centre has officially announced the names of the martyrs of Operation Sindhur.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో అమరవీరుల పేర్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్ గుండెల్లో దడ పుట్టేలా జరిపిన మెగా కౌంటర్ ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధూర్’. ఈ పోరాటంలో సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా డిక్లేర్ చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తు

    Latest News

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

    • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

    • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd