India – Pak War : పాకిస్తాన్ కు డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని పంపిన టర్కీ
India - Pak War : పాకిస్థాన్ టర్కీ (Turkey)తో చేతులు కలిపి, అధునాతన డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని తెప్పించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం
- Author : Sudheer
Date : 09-05-2025 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ను సార్ట్ చేసి…ఎక్కడిక్కడే ఉగ్రస్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టర్కీ (Turkey)తో చేతులు కలిపి, అధునాతన డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని తెప్పించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. మూడు సైనిక విమానాల ద్వారా టర్కీ పాక్‌కు ఆయుధాలను సరఫరా చేసినట్టు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే ఇస్లామాబాద్‌కు మరో టర్కీ మిలిటరీ విమానం చేరినట్లు సమాచారం అందుతుంది. కేవలం టర్కీ తోనే కాకుండా, చైనాతో కలిసి పాక్ అశాంతి సృష్టించే కుట్రలు పన్నుతోందని భారత భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
భారత్‌పై దాడులకు పాక్ సిద్ధమవుతున్న ఈ తరుణంలో, మన దేశ గగనతల రక్షణ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉంది. టర్కీ నుంచి వచ్చిన డ్రోన్లను హడావుడిగా కుదింపు చేసి భారత గగనతలంలోకి పంపించినా, మన వాయుసేన అలాంటి అన్ని డ్రోన్లను గుర్తించి వెంటనే ధ్వంసం చేసింది. పాక్ ప్రయత్నాలు పూర్తిగా విఫలమవడమే కాకుండా, వారి సాంకేతిక అవగాహనల లోపం బయటపడింది. వాయుసేన ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కారణంగా ఈ డ్రోన్లతో పాక్‌కు ఏ ప్రయోజనం కలగలేదు.
పాక్ అంతర్జాతీయంగా ఒంటరి పడిపోతున్న ఈ సమయంలో టర్కీ మద్దతు దేశ భద్రతకు నూతన సవాలుగా మారింది. టర్కీ, చైనా లాంటి దేశాలు పాక్‌కు ఆయుధ సహాయం అందిస్తుండటం పట్ల భారత భద్రతా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, భారత ప్రభుత్వం ఈ పరిస్థితులను గమనిస్తూ సంబంధిత దేశాలకు తగిన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్ దాడులపై భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.