DBT Schemes Tsunami : మహిళలకు ‘నగదు బదిలీ’తో రాష్ట్రాలకు ఆర్థిక గండం : ఎస్‌బీఐ నివేదిక
మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతినెలా నగదును బదిలీ(DBT Schemes Tsunami) చేసే సంక్షేమ పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ఎస్‌బీఐ తెలిపింది.
- By Pasha Published Date - 01:01 PM, Sat - 25 January 25

DBT Schemes Tsunami : మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతినెలా నగదును బదిలీ చేసేందుకు ఉద్దేశించిన ఉచితహామీలపై దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(ఎస్‌బీఐ) విస్మయం వ్యక్తం చేసింది. ఓట్లు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పథకాలను అమలుచేస్తే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. ముందుచూపు లేకుండా, దీర్ఘకాలిక పర్యవసానాలపై అంచనాకు రాకుండా అమలు చేసే ఇలాంటి సంక్షేమ పథకాలు రాష్ట్రాలను కుదేలు చేస్తాయని ఎస్‌బీఐ వ్యాఖ్యానించింది. ఈమేరకు వివరాలతో ఒక అధ్యయన నివేదికను ఎస్‌బీఐ విడుదల చేసింది.
Also Read :Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌కు చిట్టడవి ఊపిరి
ఎస్‌బీఐ నివేదికలోని కీలక అంశాలివీ..
- మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతినెలా నగదును బదిలీ(DBT Schemes Tsunami) చేసే సంక్షేమ పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ఎస్‌బీఐ తెలిపింది. ఇది ఆ 8 రాష్ట్రాల వార్షిక ఆదాయంలో సగటున 3 శాతం నుంచి 11 శాతానికి సమానమని పేర్కొంది.
- మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలకు నిధులను కేటాయించగల సామర్థ్యం దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఉంది. దీనికి ఉదాహరణ ఒడిశా. ఆ రాష్ట్రానికి పన్నేతర ఆదాయాలు బాగా వస్తున్నాయి. దీంతోపాటు అది కొత్తగా అప్పులు చేయడం లేదు.
- కర్ణాటకలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఒక్కో మహిళకు నెలకు రూ. 2,000 చొప్పున ఇస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.28,608 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ మొత్తం కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 11 శాతానికి సమానం.
- పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీర్ భండార్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఏటా రూ.1,000 చొప్పున వన్ టైం గ్రాంటు ఇస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.14,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది బెంగాల్ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 6 శాతానికి సమానం.
- ఢిల్లీలోని ఆప్ సర్కారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతినెలా మహిళలకు రూ.1,000 చొప్పున అందిస్తోంది. ఇందుకోసం ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది ఢిల్లీ వార్షిక రెవెన్యూ రాబడిలో 3 శాతానికి సమానం.
Also Read :Pocharam Municipality : హైడ్రా కూల్చివేతలు..ఆనందంలో ప్రజలు
- రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వేర్వేరుగా కాకుండా.. కలిసికట్టుగా ఇలాంటి పథకాలను అమలు చేస్తే బాగుంటుందని ఎస్‌బీఐ సూచించింది.
- జాతీయస్థాయిలో సార్వత్రిక నగదు బదిలీ పథకాలను అమలు చేయాలని.. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్ర సర్కారు ఏటా సరిసమానంగా గ్రాంట్లను కేటాయించాలని సిఫార్సు చేసింది. దీనివల్ల అవి ఆర్థిక సంక్షోభపు ఊబిలో కూరుకుపోవని తెలిపింది.