10 injured : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్.. 10 మందికి గాయాలు
రాజస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 10 మంది ప్రయాణికులు
- By Prasad Published Date - 07:14 AM, Mon - 2 January 23

రాజస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పాలీలోని రాజ్‌కియావాస్‌లో తెల్లవారుజామున 3:27 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావాస్-బొమద్ర సెక్షన్ మధ్య సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. బాంద్రా టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు జోధ్‌పూర్‌కు వెళుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నార్త్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులు జైపూర్‌లోని ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. త్వరలో ప్రమాద స్థలానికి చేరుకునే అవకాశం ఉందని నార్త్ వెస్ట్రన్ రైల్వే సీపీఆర్‌వో తెలిపారు. కాగా, రాజస్థాన్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల గురించి తెలుసుకోవాలనుకునే వారు క్రింద పేర్కొన్న నంబర్‌లను సంప్రదించాలి.
జోధ్‌పూర్ కోసం –
0291- 2654979(1072)
0291- 2654993(1072)
0291- 2624125
0291- 2431646
పాలి మార్వార్ కోసం –
0293- 2250324
138
1072