HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Traders Boycott Protesting Turkeys Support To Pakistan

Turkey Support Pakistan : టర్కీకి రూ.1500 కోట్లు నష్టం వచ్చేలా చేసిన భారత్

Turkey Support Pakistan : భారతదేశం గతంలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు సహాయానికి పరుగెత్తినప్పటికీ, ఇప్పుడు అదే టర్కీ పాక్‌కు డ్రోన్లు పంపుతూ మద్దతు ఇస్తోంది

  • Author : Sudheer Date : 13-05-2025 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Turkish Apples Disappear Fr
Turkish Apples Disappear Fr

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాక్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌కు టర్కీ మద్దతు (Turkey Support Pakistan) తెలిపి భారతీయుల (Indians) మనోభావాలు దెబ్బతీసింది. దీంతో మహారాష్ట్రలోని పుణే నగరంలో వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి అయ్యే పండ్ల(Turkish Apples Disappear)పై నిషేధం (Boycott ) విధించారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్, చెర్రీ, ప్లమ్, పియర్ వంటి పండ్లను ఇకపై మార్కెట్‌లోకి తీసుకురావద్దని. వాటిని అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించారు. ఈ నిర్ణయం ఫలితంగా టర్కీకి ఏకంగా రూ.1200 నుంచి రూ.1500 కోట్ల వరకు వ్యాపార నష్టం వాటిల్లనుంది.

Health Tips: ఈ ఒక్క పండు తింటే చాలు.. రోజంతా హుషారుగా ఉండడంతో పాటు ఆ జబ్బులన్నీ పరార్!

పుణే APMC మార్కెట్‌ కమిటీ తరఫున టర్కీ పండ్లపై తీసుకున్న ఈ నిర్ణయం దేశభక్తి ప్రేరణతో కూడుకున్నదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. “దేశానికి శత్రువులుగా ఉన్నవాళ్లతో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు” అని పుణేకు చెందిన యాపిల్ వ్యాపారి సుయోగ్ జెండే స్పష్టం చేశారు. టర్కీ నుంచి టన్నుల కొద్ది యాపిల్స్ దిగుమతి అయ్యే పరిస్థితుల్లో, ఇప్పుడు అవి పూర్తిగా నిలిచిపోవడంతో మార్కెట్‌యార్డుల్లో టర్కిష్ యాపిల్స్‌ కనపడడం లేదు. పైగా ప్రజలు కూడా ఈ యాపిల్స్‌ను కొనుగోలు చేయడం మానేయడంతో, వ్యాపారులకు కూడా నష్టం వచ్చినప్పటికీ ఇది దేశానికి మేలు చేస్తుందనే భావన కనిపిస్తోంది.

టర్కీకి వ్యాపార నష్టం కలిగించే విధంగా భారత వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తీరు గమనార్హం. భారతదేశం గతంలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు సహాయానికి పరుగెత్తినప్పటికీ, ఇప్పుడు అదే టర్కీ పాక్‌కు డ్రోన్లు పంపుతూ మద్దతు ఇస్తోంది. దీంతో భారతీయుల కోపం కట్టలు తెచ్చుకుంది. ప్రస్తుతం పుణే వ్యాపారులు టర్కీ యాపిల్స్‌కు బదులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి యాపిల్స్ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Market
  • Operation Sindoor
  • Pune
  • Traders' Boycott
  • Turkey Support Pakistan
  • Turkish Apples Disappear

Related News

Did Sia get married before the plot to murder Ketan was hatched? A 'secret marriage'—shocking details revealed in WhatsApp chats; police disclose the information.

Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

లోనావాలా సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోట నుండి వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి; ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ హత్య కేసులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది: కేతన్ కాబోయే భార్య (ఫియాన్సీ) మరియు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు అప్పటికే వివాహం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం కేస

  • Heavy rains in Maharashtra

    Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు

Latest News

  • Monsoon Rains: మునుపెన్నడూ చూడని వాతావరణ మార్పులు

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd