April 1st – Railway Tickets : ఏప్రిల్ 1 విడుదల.. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్స్
April 1st - Railway Tickets : ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో కొత్త నిర్ణయం అమల్లోకి రానుంది.
- By Pasha Published Date - 09:57 AM, Mon - 25 March 24

April 1st – Railway Tickets : ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో కొత్త నిర్ణయం అమల్లోకి రానుంది. రైల్వే స్టేషన్లలోని సాధారణ టికెట్ కౌంటర్లలోనూ ఇక డిజిటల్ పేమెంట్స్‌ను అనుమతించనున్నారు. రైల్వే ప్రయాణికులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, QR కోడ్ స్కానర్, UPI ద్వారా కూడా టికెట్ కోసం చెల్లింపులు చేయొచ్చు. డిజిటల్ పేమెంట్ల విధానాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ కొత్త నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో రైల్వే టికెట్(April 1st – Railway Tickets) కౌంటర్ల వద్ద చిల్లర సమస్యకు చెక్‌పెట్టినట్లు అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join
మన దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే రైలు ప్రయాణకుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించి సాధారణ రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మొదటగా ఫస్ట్ ఫేస్ లో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్న 14 స్టేషన్లో ఉన్న 31 కౌంటర్ల వద్ద ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా రైల్వే శాఖ అడగులు వేసింది. జనరల్ బుకింగ్ కౌంటర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సెకన్ల లోనే ట్రైన్ టికెట్ పొందేల అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల పేర్లు ?
భారతీయ రైల్వేకు చెందిన AI చాట్‌బోట్ AskDisha 2.0 అనేక రకాల సేవలను అందిస్తోంది. టికెట్లు బుకింగ్ చేయడం, రీఫండ్ ప్రక్రియ గురించి తెలుసుకోవడం వంటి వివిధ సేవల సమాచారాన్ని అందిస్తోంది. AskDisha 2.0 చాట్‌బోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. Corover AI ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ చాట్‌బోట్ హిందీ, ఇంగ్లీష్, హింగ్లీష్ భాషలను సపోర్టు చేస్తుంది. ఈ AI చాట్‌బోట్ IRCTC మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. AskDisha 2.0 లో చిన్న చిన్న కమాండ్లు ఉపయోగించిన రైలు టికెట్లను బుకింక్ చేసుకోవచ్చు. PNR స్టేటస్‌ను గురించి తెలుసుకోవచ్చు, టికెట్లను క్యాన్సిల్ వంటి సేవలను పొందొచ్చు. వాయిస్ కమాండ్ల ద్వారా కూడా ఈ సదుపాయాలను పొందొచ్చు.