Kejriwal: నేను కేవలం మూడు మామిడి పండ్లు తిన్నాను.. కేజ్రీవాల్
- By Latha Suma Published Date - 05:06 PM, Fri - 19 April 24

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) డైట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై కేజ్రీవాల్ 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు తీసుకున్నానని అవెన్యూ కోర్టుకు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని అది కూడా నవరాత్రి ప్రసాదమని రౌజ్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. తిహాడ్ జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తన వాదనను వినిపించారు. చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ.. ”ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉంది.
Read Also: Ramulu Naik : ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మరో భారీ షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా
టైప్-2 డయాబెటీస్తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారు. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు” అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది ఈడీ ఆరోపణలను సీఎం తరఫు న్యాయవాది ఖండిస్తూ.. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ ఛార్ట్పై నివేదిక ఇవ్వాలని తిహాడ్ జైలు అధికారులను ఆదేశించిన ధర్మాసనం ఇవాళ మరోసారి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.