RamDevBaba: రామ్ దేవ్ బాబా కు షాకిచ్చిన సుప్రీంకోర్టు, కారణం ఇదే
- By Balu J Published Date - 11:44 PM, Tue - 27 February 24
Ram Dev Baba: పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన తప్పుడు ప్రచారం ఇప్పటికే అందరికీ చేరింది. ఇది దురదృష్టకరం, పతంజలి ఉత్పత్తులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. ఇంత జరుగుతోన్న కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకొని కూర్చొని ఉందని తీవ్రస్థాయిలో మండిపడింది. పతంజలి సంస్థ కో ఓనర్ యోగా గురువు రామ్ దేవ్ బాబా అనే సంగతి తెలిసిందే.పతంజలి మందులకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు గత ఏడాది నవంబర్‌లో జారీచేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి పరిష్కారం కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రామ్ దేవ్ బాబాకు ఏమయ్యింది. మేం అతనిని గౌరవిస్తాం. యోగా చేసి మంచి పేరు సంపాదించారు. యోగా విషయంలో అందరం ఆయన మాట వింటాం. ఇతర వ్యవస్థలను ఆయన కించపరచొద్దు. పతంజలి ప్రకటన ప్రకారం దేశంలోని వైద్యులు అందరూ హంతకులా..? మరొకటా అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.