Ayodhya : అయోధ్య లో రెచ్చిపోతున్న దొంగలు..
- By Sudheer Published Date - 11:50 AM, Sun - 11 February 24

అయోధ్య లోని బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్య (Ayodhya ) లో జనవరి 22 న ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలో బాలక్ రామ్ (Balak Ram) విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు నుండి రామయ్య ను దర్శించుకునే అవకాశం ఇవ్వడం తో ప్రతి రోజు లక్షల్లో భక్తులు రామయ్య ను దర్శించుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు రామ్ లల్లాను దర్శించుకోవడానికి వెళ్లడంతో అక్కడ ఓ భక్తురాలి బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు దాదాపు 60 మంది మంగళ సూత్రాలు కాజేసినట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.
అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం వరకు చీమ చిటుక్కుమన్నా పట్టేసిన పోలీసులు.. ప్రాణ ప్రతిష్ఠ వేడుకు ముగిసిన తర్వాత బాగా రిలాక్స్ అయ్యారు.. హై సెక్యూరిటీ అంతా మాయం అయ్యింది.. లోకల్ పోలీసులు కూడా కొంచెం సేదతీరారు. ఇదే అదునుగా దొంగల రెచ్చిపోతూ, దొంగతనాలకు పాల్పడుతున్నారు. వందలాది భక్తుల మోబైల్స్, పర్సులు, బంగారం చోరీకి పాల్పడ్డారు దొంగలు. స్థానిక పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. భక్తుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు.
Read Also : World Unani Day 2024 : భారత ముద్దుబిడ్డకు హ్యాట్సాఫ్.. ఆయన పేరిటే ‘వరల్డ్ యునానీ డే’