Pahalgam Attack : బైసరన్ లోయను ఉగ్రవాదులు ఎంచుకోవడానికి కారణాలు ఇవే
Pahalgam Attack : ఈ లోయను నరమేధానికి టార్గెట్ చేసుకోవడానికి ఉగ్రవాదులకు పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది
- Author : Sudheer
Date : 23-04-2025 - 9:16 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam ) సమీపంలో ఉన్న బైసరన్ లోయ(Baisaran Valley)లో ఉగ్రవాదులు జరిపిన దాడి (Pahalgam Terror Attack ) దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భద్రతా సంస్థల పరిశీలన ప్రకారం.. ఈ లోయను నరమేధానికి టార్గెట్ చేసుకోవడానికి ఉగ్రవాదులకు పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ప్రకృతి అందాల నడుమ ప్రశాంతతగా కనిపించే ఈ ప్రాంతం, ఉగ్రవాదుల దాడుల కుట్రలకు వేదిక కావడం దేశ భద్రత పరంగా ఆందోళన కలిగిస్తోంది.
Maoist Hidma : సీక్రెట్ బంకర్‌లో హిడ్మా.. కర్రె గుట్టలపై ఏం జరుగుతోంది ?
బైసరన్ లోయకు మోటార్ వాహనాల అనుమతి లేకపోవడం ముఖ్యమైన అంశంగా చెబుతున్నారు. పహల్గామ్ నుండి బైసరన్ వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరవచ్చు. దీని వల్ల భద్రతా బలగాల ప్రతిచర్యకు ఆలస్యం జరుగుతుంది. దాడి జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని తక్షణ చర్యలు తీసుకోవడం కష్టం కావడం వల్ల ఉగ్రవాదులకు ఇది అనుకూల పరిస్థితిగా మారుతోంది.
ఇక బైసరన్ లోయ భౌగోళికంగా ఒక నెమ్మదిగా ప్రవేశించే, సులభంగా తప్పించుకునే మార్గాలున్న ప్రాంతం కావడం కూడా దాడికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన తర్వాత ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లో , చెట్ల చాటునుండి పరారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ లోయను టార్గెట్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ప్రాంతాల్లో భద్రతా పటిష్టత పెంచాల్సిన అవసరం తీవ్రంగా ఉత్కంఠకు గురిచేస్తోంది.