HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >These Are The Key People In Finance Minister Nirmala Sitharamans Team That Prepares The Union Budget

Nirmalas Team : కేంద్ర బడ్జెట్‌‌కు ఆర్థికమంత్రి నిర్మల టీమ్‌లోని కీలక సభ్యులు వీరే

తుహిన్‌ కాంత పాండే(Nirmalas Team) 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి.

  • By Pasha Published Date - 06:37 PM, Tue - 28 January 25
  • daily-hunt
Union Budget 2025 Finance Minister Nirmala Sitharamans Team

Nirmalas Team : కేంద్ర బడ్జెట్ సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల నుంచి చిరు వ్యాపారుల దాకా, కార్పొరేట్ కంపెనీల నుంచి స్వయం ఉపాధిని పొందుతున్న వారి దాకా అందరి చూపు కేంద్ర బడ్జెట్ వైపే ఉంది. ఈసందర్భంగా కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేసిన నిర్మలమ్మ టీమ్‌లోని ముఖ్యుల గురించి తెలుసుకుందాం..

Also Read :Sri Lankan Navy Firing : శ్రీలంక నేవీ ఫైరింగ్.. ఐదుగురు భారత మత్స్యకారులకు గాయాలు

తుహిన్ కాంత పాండే

  • తుహిన్‌ కాంత పాండే(Nirmalas Team) 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి.
  • ఈయన 2019 అక్టోబరు 24 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(DIPAM)  కార్యదర్శిగా వ్యవహరించారు.
  • 2024 సంవత్సరం సెప్టెంబరులో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా తుహిన్ నియమితులు అయ్యారు.
  • ఈ ఏడాది జనవరి 9న కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
  • పన్ను రాయితీలను బ్యాలెన్స్‌ చేస్తూ దేశ ఆదాయాలు తగ్గకుండా చూడటమే ఈయన విధి.
  • పన్ను వ్యవస్థను సరళీకరించుకుంటూ, దేశ రెవెన్యూను పెంచే దిశగా తుహిన్ కాంతపాండే బడ్జెట్ కోసం ప్రణాళికను అందజేశారు.
  • తుహిన్ DIPAM విభాగం కార్యదర్శిగా ఉన్న టైంలోనే ఎయిర్ ఇండియా విక్రయం జరిగింది. ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది.

అజేయ్‌ సేథ్‌

  • అజేయ్ సేథ్ 1987 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి.
  • ఆయన 2021 ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
  • కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తుది కాపీని ఫైనల్‌ చేసేది డీఈఏ విభాగంలోనే.
  • భారత ఆర్థిక వృద్ధిని, ఆర్థిక వనరులను జాగ్రత్తగా నిర్వహించడం, వ్యయాల నియంత్రణ వంటివన్నీ ఈ విభాగమే ప్లాన్ చేస్తుంది.
  • డీఈఏ కార్యదర్శిగా ఉన్న అధికారే.. బడ్జెట్ తయారీ ప్రక్రియ, అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయం, విధాన రూపకల్పన అంశాలను పర్యవేక్షిస్తారు.
  •  భారత దేశ తొలి సావరిన్ గ్రీన్ బాండ్ జారీ ప్రక్రియలో అజేయ్ సేథ్ కీలక పాత్ర పోషించారు.

Also Read :Emergency Ticket System : ‘ఐఆర్‌సీటీసీ‌’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్‌పై వివాదం.. ఏజెంట్ల దందా

అనంత్‌ నాగేశ్వరన్‌

  • అనంత్ నాగేశ్వరన్  భారత ప్రభుత్వానికి చీఫ్‌ ఎకనమిక్ అడ్వైజర్. ఈయన ఒక ప్రొఫెసర్. నిర్మలా సీతారామన్‌కు సన్నిహితుడు.
  • ఈయన సారథ్యంలోని టీమ్ ఆర్థిక సర్వేను తయారు చేస్తుంది.
  • అనంత్ గతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా సేవలు అందించారు.
  • తిరోగమనంలో ఉన్న గ్లోబలైజేషన్‌ను ఎదుర్కొవడానికి సిద్ధపడే మార్గాలను తయారు చేయడం ఆయన టీమ్ పని.
  • నాగేశ్వరన్ ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు.
  • అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఈయన డాక్టోరల్ డిగ్రీ చేశారు.

మనోజ్‌ గోవిల్‌

  • ఈయన 1991 బ్యాచ్‌ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
  • ప్రభుత్వ రాయితీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ వంటివి ఈయనే పర్యవేక్షిస్తారు.
  • ప్రభుత్వ వ్యయాలు సద్వినియోగం అయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేయడం మనోజ్‌ బృందం పని.
  • గతంలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలో పనిచేశారు.
  • ఈయన ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశారు.
  • ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ,  ఎకానమిక్స్‌ విభాగంలో పీహెచ్‌డీ చేశారు.

ఎం నాగరాజు

  • ఎం నాగరాజు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు. 2024 ఆగస్టు 19 నుంచి ఈ విభాగంలో సేవలు అందిస్తున్నారు.
  • రుణాల మంజూరు, డిపాజిట్ల మొబిలైజేషన్‌, ఫిన్‌టెక్‌లను నియంత్రించడం, బీమా కవరేజీలను పెంచడం, డిజిటల్‌ ఇన్‌ఫ్రాను మెరుగుపర్చడం వంటివన్నీ ఈ విభాగం పరిధిలోకి వస్తాయి.
  • ఈయన 1993 బ్యాచ్  త్రిపుర క్యాడర్ ఐఏఎస్‌ అధికారి.
  • అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుకు సలహాదారుడిగా నాగరాజు పనిచేశారు.
  • అంతర్జాతీయ ఫైనాన్స్‌లో ఈయనకు మంచి అనుభవం ఉంది. 
  • ఈయన పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశారు.

అరుణిష్‌ చావ్లా

  • అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి.
  • ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ)ని పర్యవేక్షిస్తున్నారు.
  • ఆర్థిక మంత్రి బృందంలో చావ్లా కొత్త సభ్యుడు.
  • ఐడీబీఐ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద పడిఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ఆయన ప్రణాళికలు తయారు చేయనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Finance Minister
  • nirmala sitharaman
  • Nirmalas Team
  • union budget
  • Union Budget 2025

Related News

    Latest News

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd