Double Votes Vs AI : ఏఐ టెక్నాలజీతో డబుల్ ఓట్ల ఏరివేత
ఓటరు జాబితాలో చనిపోయిన వారి(Double Votes Vs AI) పేర్లు కూడా ఉంటున్నాయి.
- By Pasha Published Date - 10:01 AM, Thu - 29 May 25

Double Votes Vs AI : ప్రస్తుతం మన దేశంలోని ఓటరు జాబితాలలో ఉన్న ప్రధాన సమస్య.. డబుల్ ఓట్లు. కీలకమైన అప్‌డేట్ ఏమిటంటే.. వీటిని తొలగించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించనున్నారు. అదెలాగో తెలుసుకుందాం..
Also Read :Meenakshi Natarajan : తెలంగాణ సర్కారు పనితీరుపై మీనాక్షి స్కాన్.. ఎమ్మెల్యేలతో భేటీలో కీలక అంశమదే
రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉంటే..
కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే మూడు నెలల్లో 18 సంస్కరణలను అమలుచేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడం, పోలింగ్‌ను సులభతరం చేయడం, ఓటింగ్ శాతం పెంచే చర్యలు వంటివి ఉన్నాయి. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం అనేది అక్రమం. ఇది చట్ట వ్యతిరేకం. ఈ తప్పులు ఇకపై ఓటరు జాబితాల్లో దొర్లకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) రెడీ అవుతోంది. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా సొంత రాష్ట్రంతో పాటు సమీప రాష్ట్రాల్లో ఓట్లు కలిగి వారి పేర్లను ముందుగా గుర్తిస్తారు. అనంతరం వారికి ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటరుగా కొనసాగేలా చర్యలు తీసుకుంటారు. డూప్లికేట్ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ సమస్యను పరిష్కరించడానికి యూనిక్ ఐడెంటిఫయర్‌ను తీసుకు రానున్నారు. ఓటర్ స్లిప్‌ను రీడిజైన్ చేయనున్నారు.
చనిపోయిన వారి ఓట్లు..
ఓటరు జాబితాలో చనిపోయిన వారి(Double Votes Vs AI) పేర్లు కూడా ఉంటున్నాయి. ఈ సమస్య ఎక్కువగా మనదేశంలోని మహా నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉంది. దీన్ని అదునుగా చేసుకొని కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదవుతోంది. ఈనేపథ్యంలో చనిపోయిన వారి పేర్లను ఎప్పటికప్పుడు ఓటరు జాబితాల నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని సేకరించి ఓటరు జాబితాతో లింక్ చేస్తారు. దీనివల్ల చనిపోయిన వారి పేర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తారు.