Office Peacocking : కార్పొరేట్ కంపెనీల్లో ‘ఆఫీస్ పికాకింగ్’.. ఏమిటిది ?
Office Peacocking : కార్పొరేట్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి.
- By Pasha Published Date - 09:20 AM, Thu - 2 May 24

Office Peacocking : కార్పొరేట్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. కాలం పోకడలకు అనుగుణంగా వాటి హెచ్‌ఆర్ పాలసీలను మార్చుకుంటూ ఉంటాయి. కంపెనీకి ప్రయోజనం చేకూర్చే మార్గాల వైపు పయనిస్తుంటాయి. ఇదే విధంగా మరో కొత్త ట్రెండ్ కార్పొరేట్ కంపెనీల్లో పురుడు పోసుకుంది. అదే ‘ఆఫీస్ పికాకింగ్’(Office Peacocking). ఇంతకీ ఇదేమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
కరోనా సంక్షోభం టైంలో చాలా కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇచ్చాయి. మెల్లగా ఉద్యోగులు చాలామంది దానికి అలవాటు పడిపోయారు. ఆఫీసులకు పిలిచినా తాము రాలేం అని ఉద్యోగులు చెప్పే పరిస్థితి వచ్చింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వార్నింగ్‌లు ఇచ్చే పర్వం కూడా జరిగింది. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. వర్క్ ఫ్రం హోంకే చాలామంది ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఈతరుణంలో కార్పొరేట్ కంపెనీలకు తట్టిన ఒక ఐడియానే ‘ఆఫీస్ పికాకింగ్’.
Also Read : Navodaya Jobs : నవోదయ జాబ్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. అప్లై చేసుకోండి
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు అమలు చేస్తున్న వ్యూహమే ‘ఆఫీస్ పికాకింగ్’. ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారితో హెచ్‌ఆర్ టీమ్స్ మాట్లాడి.. ఆఫీసులో మెరుగైన సౌకర్యాలపై హామీని ఇస్తాయి. పనిచేసే చోట కావాల్సిన అదనపు వసతులను కల్పిస్తామని మాట ఇస్తాయి. ఆఫీసులోనే విశ్రాంతి ఏర్పాట్లు కూడా చేస్తామని చెబుతాయి. సమయానికి భోజనం కోసం కంపెనీ తరఫున ఏర్పాట్లు ఉంటాయని ప్రామిస్ చేస్తాయి. కంపెనీ నుంచి ఇంటికి రాకపోకల విషయంలోనూ సౌకర్యాల కల్పనపై ఫోకస్ చేస్తామని హెచ్‌ఆర్ టీమ్స్ చెబుతాయి. ఏదిఏమైనప్పటికీ ఉద్యోగులను ఆఫీసుకు తిరిగి రప్పించడమే వారి అంతిమ లక్ష్యం. ప్రత్యేకించి సీనియర్ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించే వారి కోసం ఇలాంటి వసతులను కల్పించేందుకు కార్పొరేట్ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయట. జూనియర్ హోదాల్లో ఉండేవారిపై పెద్దగా ఒత్తిడి చేయడం లేదని తెలుస్తోంది. సీనియర్ హోదాలో ఉన్న వారికి టీమ్ వర్క్‌పై, పని నైపుణ్యంపై మంచి అవగాహన ఉండటంతో వారిని వదులుకోవడానికి కంపెనీలు ఇష్టపడటం లేదని పరిశీలకులు అంటున్నారు.