HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The Future Of Kashmir Will Soon Emerge

Kashmir future : త్వరలోనే తేలనున్న కాశ్మీర్ భవితవ్యం

కాశ్మీర్ (Kashmir) కి ప్రత్యేక ప్రతిపత్తిని (స్పెషల్ స్టేటస్) ప్రసాదించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసి నాలుగేళ్లవుతుంది.

  • Author : Hashtag U Date : 07-09-2023 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Future Of Kashmir Will Soon Emerge
The Future Of Kashmir Will Soon Emerge

By: డా. ప్రసాదమూర్తి

16 రోజుల సుదీర్ఘ విచారణ.. 20 పిటిషన్లు.. అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఇటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు, మరో పక్క సుప్రీం ధర్మాసనం.. అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన సీరియల్ వాదనలు.. ఇదీ కాశ్మీర్ (Kashmir) స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు సంబంధించిన సస్పెన్స్ వెనక ఇటీవల నెలకొన్న వాతావరణ. కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని (స్పెషల్ స్టేటస్) ప్రసాదించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసి నాలుగేళ్లవుతుంది. దీని మీద అతి దీర్ఘంగా కీలకమైన వాదోపవాదాలు కొనసాగాయి.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృంత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ సాగించింది. మంగళవారం విచారణ ముగిసింది. సుప్రీం కోర్టు తన తీర్పు రిజర్వులో పెట్టింది. విచారణ సాగిన పదహారు రోజులూ దేశమంతా ఎంతో ఉత్కంఠగా కోర్టు ప్రక్రియను తిలకించింది. ఇక సుప్రీం కోర్టు కాశ్మీర్ (Kashmir) విషయంలో ఏం తీర్పు చెప్తుందా అన్న విషయమే చాలా ఆసక్తికరంగా మారింది.

2019లో కేంద్రం జమ్మూ కాశ్మీర్ (Kashmir) స్పెషల్ స్టేటస్ ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి కాశ్మీర్ నుంచి దేశానికి అందే వార్తల్లో ఏది నిజం..ఏది అబద్ధమో తేల్చుకోడానికి ఎలాంటి యంత్రాంగమూ సాధారణ పౌరులకే కాదు, మీడియాకి కూడా లేదు. ఎంతో కాలం అక్కడ ఇంటర్నెట్ లేదు. నాయకులు గృహ నిర్బంధంలో ఉన్నారు. కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం కోసమే ఇదంతా చేస్తున్నట్టు కేంద్రం చెప్తున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు మాత్రం కాశ్మీర్ లో నియంతృత్వం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాశ్మీర్ లో స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి 370 అధికరణాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని మీద దాదాపు 20 పిటిషన్లు నమోదయ్యాయి. పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమనియం లాంటి హేమాహేమీలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేతృత్వం వహించారు.

కోర్టు వాదనలు చాలా ఆసక్తికరంగా సాగాయి. రాజ్యాంగంలోని 370 అధికరణం తాత్కాలికమైంది కాదని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో పాలన కొనసాగించే అవకాశం జమ్మూకాశ్మీర్ కి చట్టం కల్పించిన హక్కు అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఆర్టికల్ 356 ద్వారా విధించిన రాష్ట్రపతి పాలన కాశ్మీర్ లో దుర్వినియాగమవుతోందని వారి వాదన. అయితే ఆర్టికల్ 370 శాశ్వతమైంది కాదని ప్రభుత్వ తరపు వాదనలు సాగాయి.

పోతే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కూడా ప్రభుత్వం తరపున వాదించిన ఎస్.జి. తుషార్ మెహతా చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని చాలా ప్రశ్నలే వేశారు. రాష్ట్రపతి పాలన విధించాక కాశ్మీర్ లో పరిస్థితులు చాలా చక్కబడ్డాయని ప్రభుత్వం చెప్తోంది. మరి పరిస్థితులు కుదుటపడితే రాష్ట్రపతిపాలన ఎత్తివేసి అక్కడ ఎన్నిక లు ఎందుకు నిర్వహించడం లేదని ధర్మాసనం అడిగింది.

ఎన్నికలు నిర్వహించడానికి తామూ సిద్ధమేనని మెహతా అన్నారు. మరెప్పుడు జరుపుతారో …కాల పరిమితి ఏంటో చెప్పాలని కోర్టు నిలదీసింది. తాము నిర్దిష్ట కాల పరిమితిని చెప్పలేమని ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన సమాధానం. అలాగే రాష్ట్ర శాసనసభకు, ఎవరు కాశ్మీర్ మూల వాసులు.. ఎవరు కాదని నిర్ణయించే అదికారాన్ని కట్టబెట్టే ఆర్టికల్ 35ఏ గురించి కూడా సుప్రీం న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ లో స్థానికులు కాని వారు అక్కడ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

మొత్తానికి ఎవరి వాదనలు ఎలా ఉన్నా కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ని ప్రసాదించే ఆర్టికల్ 370 విషయంలో సస్పెన్స్ ఇక వీడనుంది. ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు తన తీర్పు ఏ విధంగా చెబుతుందా అన్నదే దేశమంతా ఎదురు చూస్తున్న విషయం.

Also Read:  India Name Change : ఇండియా పేరు మార్పుపై ఐరాస ఏమంటుందంటే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARTICLE 370
  • Future
  • government
  • Independence
  • kashmir
  • modi
  • Supreme Court

Related News

Supreme Court allows passive euthanasia for Harish Rana

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

Supreme Court Allows Passive Euthanasia For Harish Rana  గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd