HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The Bjp Shines In The Politics Of The Country

BJP Shines: ‘జాతీయం’లో బీజేపీదే హవా!

బ్రిటిష్ వారు భారతదేశాన్ని 1757 నుండి 1947 వరకు...అంటే 190 సంవత్సరాలు పరిపాలించారు 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాతో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత...

  • Author : CS Rao Date : 15-02-2022 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp
Bjp

బ్రిటిష్ వారు భారతదేశాన్ని 1757 నుండి 1947 వరకు…అంటే 190 సంవత్సరాలు పరిపాలించారు 1757లో బెంగాల్ నవాబు
సిరాజ్ ఉద్దౌలాతో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత… భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్ళపాటు భారతీయ, ప్రాంతీయ పాలకులు బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయారు. వంద సంవత్సరాల పాటు 1857 నుండి 1947 వరకు అంటే వందేళ్ళ పాటు దాదాపు ఎలాంటి రాజకీయ ప్రతిఘటన లేకుండా బ్రిటిష్ పాలన సాగింది. ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు వందేళ్ల పాటు బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి దేశాన్ని వదిలేశారు.చివరికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, బలహీనపడిన బ్రిటిష్ వారు తమకు తామే ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. అంటే, సోనియా గాంధీ ఇవ్వాలి అనుకున్నప్పుడే తెలంగాణ వచ్చినట్టు తీరులా బ్రిటిష్ వాళ్ళు వెళ్లాలనుకున్నప్పుడు భారత్ కు స్వాతంత్రం వచ్చిందన్నమాట.

మళ్లీ 2014 తర్వాత ఢిల్లీ పీఠాన్ని రాజకీయ పార్టీలే బీజేపీకి వదిలేసినట్లు కనిపిస్తుంది. ఈ పాపంలో ప్రధాన పాత్రధారి రాహుల్ గాంధీ.56 సంవత్సరాల పాటు స్వతంత్ర భారత దేశాన్ని పాలించిన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ పలాయనవాదం బీజేపీకి వరంగా మారింది. 1989లో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం 2014 నాటికి క్లైమాక్స్ చేరింది. ఒకవైపు కాంగ్రెస్ అస్త్రసన్యాసం మరోవైపు ప్రాంతీయ పార్టీల లో ఉద్దండులైన శరత్ పవార్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మొన్నటి వరకు కరుణానిధి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, దేవగౌడ మొదలైనవారు జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేయటంలో బలహీన పడటం వలన జాతీయ రాజకీయ క్షేత్రం మొత్తం బీజేపీ పరమైంది. స్థానికంగా సర్దుకోవడానికే మమతా బెనర్జీ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.

జాతీయ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అన్నట్టు నవీన్ పట్నాయక్ బతుకుతున్నాడు. కొన్నాళ్ల పాటు జాతీయ రాజకీయాల గురించి ప్రకటనలు తప్ప ప్రత్యామ్నాయ కార్యాచరణకు సిద్ధంగా స్టాలిన్ లేడు. ఇష్టం లేకపోయినాబిజెపితోనే కాపురం చేస్తున్న నితీష్ కుమార్ వాలకం చూస్తున్నాం. స్థూలంగా గత ఎడున్నర సంవత్సరాలుగాసమరం చేయాల్సిన వాళ్లు కూడా సామూహిక సన్యాసం చేసిన కారణంగా దేశ రాజకీయాల్లో బీజేపీ వెలిగిపోతుంది.ఈ నేపథ్యంలో స్టాలిన్ ఆలోచన ను యుద్ధ ప్రాతిపదికన ఆచరణలోకి తీసుకురావాలి.భారత రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి బతకాలంటే ఇప్పుడో ఒక చారిత్రాత్మక అవసరం. దీనికి ఎవరు ముందుకొస్తారో వాళ్లే భవిష్యత్ రాజకీయ హీరోలు అనేది పీకే లాంటి వాళ్ళ సర్వే సారాంశం. అప్పటి వరకు బీజేపీ వెలిగిపోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • Naredna Modi
  • Shines

Related News

West Bengal BJP CM Suvendu Adhikari

Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • Congress must introspect, says Shashi Tharoor

    Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

Latest News

  • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

  • TVK విజయ్‌ అను నేను..

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

Trending News

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd