SpiceJet : స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం
SpiceJet : ఈ సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసరంగా చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం తిరిగి ల్యాండ్ అయిన వెంటనే టెక్నికల్ బృందం రంగంలోకి దిగింది
- By Sudheer Published Date - 12:16 PM, Fri - 4 July 25

ఈ మధ్య వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Problems) ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని క్షేమంగా బయటపడగా..మరికొన్ని క్రాష్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపగా..ఈ ఘటన తర్వాత కూడా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక సమస్య రావడం ప్రయాణికుల్లో ఆందోళన నింపింది.
చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ (SpiceJet ) విమానంలో శుక్రవారం ఉదయం అనుకోని సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్‌కు కొన్ని యాంత్రిక సమస్యలు కనిపించడంతో అప్రమత్తంగా స్పందించి విమానాన్ని తిరిగి చెన్నై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ తీసుకున్న ఈ నిర్ణయం వలన పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
Tungabhadra Dam : పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర.. డ్యామ్ 20 గేట్లు ఎత్తివేత
ఈ సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసరంగా చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం తిరిగి ల్యాండ్ అయిన వెంటనే టెక్నికల్ బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక లోపం ఏంటన్నదానిపై విచారణ ప్రారంభించారు. ఈ లోపం వల్ల ప్రయాణికులు దాదాపు రెండు గంటల పాటు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చింది. ఎలాంటి ప్రమాదం జరగకపోయినా, ఈ అనూహ్య పరిస్థితి వారికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.
విమాన సిబ్బంది సహాయకంగా వ్యవహరించగా, ప్రయాణికులు మాత్రం తమ ప్రయాణంలో ఇలాంటివి జరగడం చాలా అసహజమని అభిప్రాయపడుతున్నారు. స్పైస్‌జెట్ అధికారుల ప్రకారం.. సమస్యను త్వరితగతిన పరిష్కరించి విమానాన్ని మళ్లీ ప్రయాణానికి సిద్ధం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ లోపాన్ని గుర్తించి, విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు… pic.twitter.com/rfWrzrNAYk
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2025