Waqf Board Bill : వక్ఫ్ బిల్లు కు అధికారికంగా మద్దతు ప్రకటించిన టీడీపీ
Waqf Board Bill : ఈ బిల్లుపై లోక్ సభలో జరిగే చర్చకు తమ ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ విప్ జారీ చేసింది
- Author : Sudheer
Date : 01-04-2025 - 9:46 IST
Published By : Hashtagu Telugu Desk
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు (Waqf Board Bill)కు టీడీపీ మద్దతు (TDP Support) ప్రకటించడం ప్రధాన రాజకీయ పరిణామంగా మారింది. ఈ బిల్లుపై లోక్ సభలో జరిగే చర్చకు తమ ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ విప్ జారీ చేసింది. ప్రధానంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి టీడీపీ చేసిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందడం గమనార్హం. వీటిలో వక్ఫ్ ఆస్తుల పునరాలోచనకు అవకాశమివ్వకూడదనే ప్రతిపాదన, కలెక్టర్‌కు తుది అధికారం ఉండకూడదని పేర్కొనడం, డిజిటల్ పత్రాల సమర్పణకు 6 నెలల గడువు పొడిగింపు వంటి అంశాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు దోహదం చేయనున్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.
HCU భూముల విషయంలో పార్టీల ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దు – భట్టి
వక్ఫ్ ఆస్తుల్లో ముస్లిమేతరుల ప్రమేయంపై టీడీపీ గట్టి స్థాయిలో పోరాడుతోంది. ముస్లిం మత వ్యవహారాలలో ఇతర మతస్థులకు ప్రమేయం ఉండకూడదనే విషయాన్ని టీడీపీ స్పష్టంగా వెల్లడించింది. హిందూ దేవాలయాల విషయంలో ఇతర మతస్థుల హస్తক্ষেপాన్ని అంగీకరించని విధంగానే, వక్ఫ్ ఆస్తుల విషయంలో కూడా అదే ప్రమాణాలను పాటించాలనే అభిప్రాయాన్ని టీడీపీ వ్యక్తం చేసింది. ఈ అంశంపై ముస్లిం సమాజం మరింతగా పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా వైసీపీ వక్ఫ్ సవరణ చట్టంపై ఇప్పటి వరకు ఏ ఒక్క సవరణ కూడా ప్రతిపాదించకపోవడం ముస్లిం సమాజం గమనించాల్సిన విషయం. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటూ, ముస్లిం సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా వైసీపీ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ చేపట్టిన ఈ ప్రయత్నాలు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఎంతగానో సహాయపడతాయని, ఈ అంశంపై ముస్లిం నేతలు మరింత చైతన్యంతో స్పందించాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.