Freshers Hiring : టీసీఎస్‌లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ షురూ.. వివరాలివీ
Freshers Hiring : బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్ పూర్తి చేశారా ? దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగం పొందే అవకాశమిది.
- Author : Pasha
Date : 30-03-2024 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
Freshers Hiring : బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్ పూర్తి చేశారా ? దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగం పొందే అవకాశమిది. ఓ వైపు చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. మరోవైపు టీసీఎస్ మాత్రం ఫ్రెషర్స్‌ను నియమించుకుంటోంది. ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు టీసీఎస్ కసరత్తును మొదలుపెట్టింది. అర్హులైనవారు ఏప్రిల్ 10లోగా అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు ఏప్రిల్ 26న టెస్ట్ నిర్వహిస్తారు. ప్రస్తుతం డిజిటల్, ప్రైమ్, నింజా కేటగిరీల్లో టీసీఎస్ నియామకాలు చేపడుతోంది. నింజా కేటగిరీ ఉద్యోగులకు ఏడాదికి రూ.3.36 లక్షలు, డిజిటల్ కేటగిరీ ఉద్యోగులకు ఏడాదికి రూ.7 లక్షలు, ప్రైమ్ కేటగిరీ ఎంప్లాయీస్‌కు ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.11.5 లక్షల వేతనం చెల్లిస్తారు. అయితే ఎంత మంది ఫ్రెషర్లను(Freshers Hiring) టీసీఎస్ ఈ ఏడాది నియమించుకోనుంది అనే విషయం తెలియరాలేదు.
We’re now on WhatsApp. Click to Join
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI) కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునే దిశగా టీసీఎస్ అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల మందికి జనరేటివ్ ఏఐలో టీసీఎస్ ట్రైనింగ్ ఇచ్చింది. దాదాపు 3.5 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులకు వివిధ విడతల్లో జనరేటివ్ ఏఐ స్కిల్స్‌లో శిక్షణ పూర్తయింది. కంపెనీకి చెందిన సగానికిపైగా ఉద్యోగులను ఏఐ ప్రొడక్టుల తయారీ దిశగా సన్నద్ధం చేసింది.క్లౌడ్, ఏఐ విషయంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాల కోసం ప్రత్యేకంగా బిజినెస్ యూనిట్‌లను కూడా టీసీఎస్ ఏర్పాటుచేసింది. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి జనరేటివ్ ఏఐ కాంపిటెన్సీ పార్ట్‌నర్ స్టేటస్‌ను కూడా అందుకుంది.
Also Read :Rat Glue Traps : ఎలుకలు పట్టే ప్యాడ్లు ఈ-కామర్స్ సైట్ల నుంచి ఔట్.. ఎందుకు ?
2023-24 ఆర్థిక సంవత్సరంలో మనదేశంలోని ప్రధాన టెక్ కంపెనీలు కొత్తగా దాదాపు 60 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నాయని ఒక అంచనా. ఒకవేళ అదే జరిగితే మనదేశంలోని మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 54.30లక్షలకు చేరుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు దాదాపు 2.7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చాయి.