Supreme Court : నీటి వనరుల పరిరక్షణ లేకుండా స్మార్ట్ సిటీ ఎలా?
Supreme Court : రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో నీటి వనరుల పరిరక్షణ క్రమంగా తగ్గిపోతుండటాన్ని గమనించిన సుప్రీం కోర్టు
- By Sudheer Published Date - 02:35 PM, Mon - 24 February 25

భారతదేశం(India)లోని నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో నీటి వనరుల పరిరక్షణ (Conservation of water resources) కీలక అంశంగా మారింది. అయితే, నగరాలు విస్తరించడంలో నీటి మడుగులు, సరస్సులు, వెట్‌ల్యాండ్‌ల వినియోగం తగ్గిపోతుంది. దీనిపై సుప్రీం కోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తం చేస్తూ నీటి వనరులను పరిరక్షించకుండా స్మార్ట్ సిటీ ఎలా అవుతుందనే ప్రశ్నను లేవనెత్తింది. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో నీటి వనరుల పరిరక్షణ క్రమంగా తగ్గిపోతుండటాన్ని గమనించిన సుప్రీం కోర్టు..ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని (చీఫ్ సెక్రటరీ) (Rajasthan Chief Secretary) వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
Germany Elections: జర్మనీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం.. క్రైస్తవ పార్టీల విజయ దుందుభి
సుప్రీం కోర్టు తన వ్యాఖ్యల్లో ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలోని సహజ వనరులను పరిరక్షించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో నీటి వనరులు నాశనం చేయడం, వాటిని ఆక్రమించడం, నిర్మాణాలకు అనుకూలంగా మార్చడం ప్రమాదకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలు నగరాభివృద్ధిలో భాగంగా నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రాజస్థాన్లో నీటి మడుగులు, సరస్సులు ఆక్రమణకు గురయ్యాయి అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ విచారణ దేశవ్యాప్తంగా నీటి వనరుల పరిరక్షణపై చర్చను ప్రేరేపించింది. నగరాభివృద్ధికి నీటి వనరుల సమతుల్యత అవసరమని, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత సమస్య తీవ్రంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సమన్లు జారీ చేయడం ఇతర రాష్ట్రాలకు కూడా గుణపాఠమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధికి తోడుగా ప్రకృతిని రక్షించుకునే విధంగా పాలన సాగించాల్సిన అవసరం ఉందని ఈ కేసు ద్వారా కోర్టు ప్రస్తావించింది.