Delhi Bomb Blast : ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు
Delhi Bomb Blast : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాలు ఈ ఘటన ఆత్మాహుతి దాడి కావచ్చనే అనుమానాలను బలపరుస్తున్నాయి
- By Sudheer Published Date - 01:16 PM, Tue - 11 November 25
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాలు ఈ ఘటన ఆత్మాహుతి దాడి కావచ్చనే అనుమానాలను బలపరుస్తున్నాయి. పేలుడు జరిగిన 120 నంబర్ కారులో ఫ్యూయల్ కేన్లు, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిని దుండగుడు సూత్రప్రాయంగా పేలుడు స్థలానికి తీసుకువచ్చినట్లు గుర్తించారు. పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో కారును గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైందని, శవ అవశేషాల ఆధారంగా మాత్రమే వ్యక్తి వివరాలు నిర్ధారించగలమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
Dharmendra: నటుడు ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించిన కూతురు!
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR26 CE7674 ఆధారంగా హరియాణాలోని గురుగ్రామ్ రవాణా విభాగాన్ని సంప్రదించారు. ఈ వాహనం యజమాని మహ్మద్ సల్మాన్ అని, ఆయన ఈ కారును జమ్ము కశ్మీర్‌కు చెందిన తారిఖ్ అనే వ్యక్తికి అమ్మినట్లు సమాచారం లభించింది. అయితే తారిఖ్ ఆ కారును మరో వ్యక్తికి ఇచ్చాడని, చివరికి నిన్న దాన్ని డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ చైన్ ద్వారా ఆ వాహనం ఎలా ఉగ్రదాడికి ఉపయోగించబడిందనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి బృందాలు కృషి చేస్తున్నాయి.
ఇక జమ్ము కశ్మీర్ పోలీసులు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, NIA కలిసి సంయుక్త దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాద అనుమానితులతో డాక్టర్ ఉమర్‌కు సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అతడిపై ఇంటెలిజెన్స్ యూనిట్లు దృష్టి సారించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న సమీక్ష సమావేశంలో ఈ ఆధారాలు సమర్పించబడనున్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న అసలు ఉగ్రవాద మాస్టర్‌మైండ్‌ను గుర్తించి దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.