HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sudha Murthy Reacts On Being Nominated To Rajya Sabha

Sudha Murty : రాజ్యసభకు నామినేట్‌ కావడంపై స్పందించిన సుధామూర్తి

  • Author : Latha Suma Date : 08-03-2024 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sudha Murthy Reacts On Bein
Sudha Murthy Reacts On Bein

 

Sudha Murty : తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu).. సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనదని ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం అని కొనియాడారు. ఈ నేపథ్యలో ప్రధాని మోడీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, మానవత్వవాదిగా సుధామూర్తి దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

read also : National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pm modi
  • President Draupadi Murmu
  • Rajya Sabha
  • Sudha Murty

Related News

Raghav Chadha

ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కార‌ణం ఇదేనా?!

గత కొంతకాలంగా రాఘవ్ చద్దా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఎయిర్‌పోర్టుల్లో రూ. 10 టీ అంశం, డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన బలంగా వినిపించారు.

  • PM Modi

    ప‌శ్చిమాసియాలో యుద్ధం.. మూడు గంట‌ల‌పాటు ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం!

  • Amaravati Bill In Rajya Sabha

    Rajya Sabha: అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభకు!

  • Pemmasani Chandrasekhar

    Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Latest News

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

  • శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

  • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

  • స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

  • టాయిలెట్ పేపర్‌ను వాడుతున్నారా? అయితే న‌ష్టాలివే!

Trending News

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd