Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
- Author : Hashtag U
Date : 21-03-2023 - 10:58 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేశారు.
On the streets after feeling the tremors in Delhi. Strong tremors across NCR. Experiencing this after the earthquake followed by tsunami in India. pic.twitter.com/yGq9cpbB9F
— KhushbuSundar (@khushsundar) March 21, 2023
ఆఫ్ఘనిస్థాన్‌లోని కలాఫ్ఘన్ ప్రాంతానికి 90 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని తెలుస్తున్నది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు సమాచారం. దీని ప్రభావంతో తుర్కెమినిస్థాన్, కజకిస్తాన్, పాకిస్థాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్థాన్, కిర్గిస్థాన్ దేశాల్లోనూ భారీగా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల ఆస్తి,ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.