SBI Jobs : ఎస్‌బీఐలో 10వేల ఉద్యోగాల భర్తీ.. 600 కొత్త బ్రాంచీలు
ఇందుకోసం దాదాపు 1500 మంది(SBI Jobs) సాంకేతిక నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నారు.
- By Pasha Published Date - 04:26 PM, Sun - 6 October 24

SBI Jobs : నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ వినిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో చేపట్టబోతున్న ఉద్యోగ నియామకాలపై కీలక ప్రకటన చేసింది. ఎస్‌బీఐ బలోపేతం కోసం రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలోని కీలక సమాచారాన్ని వెల్లడించింది.
Also Read :Ola CEO Vs Comedian : ఓలా సీఈఓ వర్సెస్ కమేడియన్ కమ్రా ట్వీట్ల యుద్ధం
ఎస్‌బీఐ నూతన ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి ఇటీవలే నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో ఎస్‌బీఐ పురోగతి కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ కోసం దాదాపు 10 వేల మంది నూతన ఉద్యోగులను భర్తీ చేసుకోనున్నారు. కొత్తగా ఉద్యోగులను భర్తీ చేసుకోవడం ద్వారా ఎస్‌బీఐకు సంబంధించిన సాధారణ బ్యాంకింగ్ అవసరాలన్నీ తీరుతాయని భావిస్తున్నారు. ఇక ఎస్‌బీఐకు సంబంధించిన సాంకేతిక వనరులను మరింత బలోపేతం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు 1500 మంది(SBI Jobs) సాంకేతిక నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ లిస్టులో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్టులు, నెట్‌వర్క్ ఆపరేటర్ల వంటి ఎక్స్‌పర్ట్స్ ఉంటారని అంటున్నారు.
Also Read :Waiter Jobs : కెనడాలో వెయిటర్ జాబ్స్.. వేలాది మంది భారత విద్యార్థుల క్యూ
ఈ ఏడాది మార్చి నాటికి మన దేశంలో 22,542 ఎస్‌బీఐ బ్రాంచీలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మార్చికల్లా దేశవ్యాప్తంగా కొత్తగా 600 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బీఐలో మొత్తం 2,32,296 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా ఎస్‌బీఐ నిర్వహించనుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను మార్చాలనే ప్లాన్‌తో ఎస్‌బీఐ నూతన ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఉన్నారు. ఈ ఇవన్నీ అమలైతే ఎస్‌బీఐ కొత్తరెక్కలు తొడగడం ఖాయం. తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.