SSC New Website : అభ్యర్థులూ SSC వెబ్‌సైట్ మారింది.. అది చేసుకోండి
SSC New Website : పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కీలక పాత్ర పోషిస్తుంటుంది.
- By Pasha Published Date - 06:41 PM, Sat - 24 February 24

SSC New Website : పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కీలక పాత్ర పోషిస్తుంటుంది. తాజాగా ఎస్ఎస్‌సీ తన అధికారిక వెబ్సైట్ను మార్చేసింది. ప్రస్తుతమున్న https://ssc.nic.in/ యూఆర్ఎల్ను https://ssc.gov.in/ గా మార్చింది. ఈ కొత్త వెబ్సైట్ను ఫిబ్రవరి 17నే ప్రారంభించారు. ఎస్ఎస్‌సీ కొత్త వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవడం తప్పనిసరి. వెబ్‌సైట్ పేరును మార్చిన నేపథ్యంలో అభ్యర్థులు అందరకూ కచ్చితంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలి. ఇకపై ఉద్యోగ ప్రకటనలు, పరీక్ష ఫలితాలు అన్నీ నూతన వెబ్‌సైట్‌లోనే ప్రచురితం అవుతాయని వెల్లడించింది. అందువల్ల రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ వెబ్‌సైట్‌లోనే(SSC New Website) చేసుకోవాలి.
We’re now on WhatsApp. Click to Join
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 100 పోస్టులు (గుంటూరు – 40, విజయవాడ – 30, విశాఖపట్నం – 30); తెలంగాణాలో 96 పోస్టులు (హైదరాబాద్ -58, వరంగల్ – 38) ఉన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్కు ఆఖరు తేదీ మార్చి 6. ఆన్‌లైన్ పరీక్ష తేదీ మార్చి 10.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
యూపీఎస్సీ 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 2024 మార్చి 5. ప్రిలిమినరీ పరీక్ష 2024 మే 26న నిర్వహిస్తారు.
Also Read : Income Tax – A Flat : నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొంటున్నారా ? ఇవి తెలుసుకోండి
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ డిగ్రీలు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తుల స్వీకరణ 2024 ఏప్రిల్ 2న మొదలవుతుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ మే 1.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్రెడిట్ ఆఫీసర్, ఫారెక్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ మొదలైన పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 25. పరీక్ష తేదీ మార్చి/ ఏప్రిల్.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 9న మొదలవుతుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8.